areested
-
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు: మరో ఇద్దరు అరెస్ట్
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో ఇద్దరు నిందితులను తాడిపత్రి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రామ్మూర్తి, ఇమామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు నలుగురు జేసీ ట్రావెల్స్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్ యాజమాన్యం ఆదేశాలతోనే నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. తాడిపత్రి ఎస్ఐ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన నకిలీ స్టాంపులు వినియోగించినట్లు విచారణలో బయటపడింది. నకిలీ పత్రాలతో 6 లారీలను జేసీ ట్రావెల్స్ బెంగుళూరులో విక్రయించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డి జేసీ ట్రావెల్స్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఫోర్జరీ సర్టిఫికెట్ల తయారీ వెనుక జేసీ దివాకర్ రెడ్డి హస్తం జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అవినీతికి చిరునామా అని ధ్వజమెత్తారు. జేసీ వ్యాపారాలన్నీ అక్రమాలేనని, బోగస్ సర్టిఫికెట్లు తయారీలో జేసీ దివాకర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. జేసీ బద్రర్స్ డబ్బు పిచ్చి వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీ ట్రావెల్స్ బస్సులు నడిపారని.. అక్రమ మైనింగ్‌తో వందల కోట్ల రూపాయలు జేసీ దోచుకున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దివాకర్‌రెడ్డి పాపం పండిందని.. ఆయన చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. జేసీ బ్రదర్స్‌ను అరెస్ట్ చేసి విచారించాలని పోలీసులకు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి విజ్ఞప్తి చేశారు. (చదవండి: జేసీ ట్రావెల్స్‌లో బయటపడ్డ ఫోర్జరీ బాగోతం) -
డాక్టర్‌నంటు యువతులకు గాలం వేసి..
సాక్షి, విశాఖపట్నం: చేసేది డ్రైవర్ ఉద్యోగం.. కానీ డాక్టర్‌నంటు యువతులతో పరిచయాలు ఏర్పరచుకుని లోబరుచుకునేవాడు. తర్వాత వేధింపుల పర్వానికి తెరతీసి.. వారి నుంచి నగలు, నగదు దోచుకునేవాడు. విశాఖలో వైద్యుడిగా చలామణీ అవుతూ మహిళలను ముగ్గులోకి దింపి వేధింపులకు గురి చేసిన మోసగాడి గుట్టు రట్టయింది. 20 మంది యువతులు ఆ మాయగాడి బారిన పడినట్లు పోలీసులు గుర్తించారు. కంచరపాలెంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తప్పుడు వివరాలతో ఓ ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. వైద్యుడిగా పరిచయం చేసుకుని యువతులను లోబరుచుకునేవాడు. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఈ విధంగా యువతలను బెదిరించి పెద్ద ఎత్తున బంగారు నగలు, భారీగా నగదు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా వారి స్నేహితుల్ని తన లైంగిక వాంఛలు తీర్చేలా చేయాలని బాధితులను ఒత్తిడి చేసేవాడు. మాయగాడి వలలో పడిన బాధితురాలొకరు నేరుగా నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. సుమారు ఆరు నెలలుగా ఈ తతంగమంతా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కంచరపాలెంలో నాలుగురోజుల క్రితం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. -
యజమానినే ముంచేశారు..
పెదగంట్యాడ(గాజువాక): శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలన్నారు.. మంచి వారని భావించిన ఇంటి యజమాని వారికి ఇల్లు అద్దెకు ఇచ్చారు. తర్వాత ఇరుకుటుంబాల వారు బాగా దగ్గరయ్యారు. ఒకరికొకరు కష్టసుఖాలను పంచుకునేవారు. ఇదే ఆ ఇంటి యజ మాని నిలువునా మోసపోవడానికి దారితీసింది. ఈ సంఘటన వివరాలను న్యూపోర్టు పోలీస్ స్టేషన్లో సీఐ పైడపునాయుడు విలేకరులకు బుధవారం వివరించారు. ఇంటి యజమానికి పెళ్లయినా పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం కలిగారు. అయితే యజమాని ఇటీవల మొదటి భార్యతో చనువుగా ఉండడంతో రెండో భార్య తట్టుకోలేపోయింది. తన పరిస్థితిని వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారితో వాపోయింది. ఇదే అదునుగా భావించి వారు ఆమెను నిలువునా ముంచేశారు. పూజల పేరిట రూ.4.20 లక్షల నగదుతో పాటు 7తులాల బంగారం, వెండి సామగ్రి దోచేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి అసలు రంగు బయటపడింది. 62వ వార్డు టీజీఆర్ నగర్లో దవులూరి చంద్రరావు అ నే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నా డు. ఏడాది కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన వానపల్లి సీతారాం, అతని తల్లి పద్మ, చెల్లెలు కుమారితో వచ్చి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. చంద్రరావుకు వివా హమైనా పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలైన నిర్మలను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో చంద్రరావు మొద టి భార్యతో చనువుగా ఉండడంతో తట్టుకోలేకపోయిన నిర్మల ఇంట్లో అద్దెకుంటున్న వారితో తన పరిస్థితిని వివరించింది. ఇదే అదునుగా భావించిన వారు ‘నీ భర్తకు ప్రాణగండం ఉంద ని, పూజలు చేయాల’ని నమ్మబలికారు. అంతేకాకుండా ఆ విషయాన్ని తన భర్తకు చెబితే రక్తం కక్కుకుని చనిపోతాడని భయాందోళనకు గురి చేశారు. దీంతో భయపడిన నిర్మల భర్తకు తెలి యకుండా రూ.4.20 లక్షల నగదు, 7తులాల బంగారం, వెండి వస్తువులను దఫదఫాలుగా వారికి అందజేసింది. తర్వాత తాను మోసపోయానని భర్తకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ అప్పలరాజు పాల్గొన్నారు. -
నకిలీనోట్ల చలమణి ముఠా అరెస్ట్
-
ముడుపులతో పట్టుబడ్డ కస్టమ్స్ అధికారులు..
సాక్షి, ముంబయి: లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన నలుగురు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్లను, మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ముడుపులు తీసుకుంటున్న డిప్యూటీ కమిషనర్లు ముఖేష్ మీనా, రాజీవ్ కుమార్ సింగ్, సుదర్శన్ మీనా, సందీప్ యాదవ్, సూపరింటెండెంట్ మనీష్ సింగ్ మరో వ్యక్తి నీలేష్ సింగ్‌లను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కన్సైన్మెంట్కు అనుమతి ఇచ్చేందుకు కస్టమ్స్ అధికారులు రూ 50 లక్షల ముడుపులు అడిగారనే ఫిర్యాదుపై సీబీఐ ఈ దాడులు చేపట్టింది. తొలుత రూ 5 లక్షలు లంచం తీసుకుంటూ ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఓ ప్రైవేట్ వ్యక్తి పట్టుబడగా, వారి ద్వారా మిగిలిన అధికారుల పాత్రనూ సీబీఐ పసిగట్టి వారినీ అదుపులోకి తీసుకుంది. నిందితుల కార్యాలయాలు, నివాసాలపై ఏకకాలంలో సీబీఐ దాడులు చేపట్టింది. -
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
కరీంనగర్‌క్రైం : కొన్నేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అధిక ధరలున్న బియ్యాన్ని నమూనాగా చూపించి రేషన్‌బియ్యం అంటగడుతున్న ముఠాను సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ హెడ్‌క్వార్టర్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో సీఐలు మాధవి, కిరణ్ విలేకరులతో వివరాలు తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లడ మండలం అన్నారుగూడెంకు చెందిన సుంకర కనకరావు(42), సోదా వెంకటేశ్వర్లు(35), నర్సింహరావుపేటకు చెందిన గోపిశెట్టి నాగేశ్వర్రావు(35) ముఠాగా ఏర్పడ్డారు. ఆటోలో తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. వీటినే ఇంటివద్ద 25 కిలోల బస్తాల్లో నింపి ఊరూరా తిరుగుతూ సన్నబియ్యమని విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే సన్నబియ్యం వస్తుండడంతో జనం కూడా కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికెళ్లి చూసేలోగానే వారు అక్కడి నుంచి పరారయ్యేవారు. ఇలా పలు జిల్లాల్లో పదేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీరిపై ఆయా ప్రాంతాల్లో కేసులు సైతం నమోదయ్యాయి. కరీంనగర్‌లోని తిరుమల్‌నగర్‌కు చెందిన అజ్మీరా రాజు గత నెల 31న ఆటోలో వచ్చిన వీరి నుంచి సన్నబియ్యం మూడు క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి చూడగా రేషన్‌బియ్యంగా గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం తిరుమల్‌నగర్‌కు వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.10,500, ఆటో, బియ్యంబస్తాలు, మెషిన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
జాదూగాడురా..
పెళ్లిళ్లు చేయిస్తానని చెప్పి మోసానికి పాల్పడిన యువకుడు అరెస్టు యువతను మోసగిస్తున్న ఎంటెక్ పట్టభద్రుడు వివాహాలు చేయిస్తానని రూ.లక్షల్లో వసూలు నిందితుడి అరెస్టు, రూ.12 లక్షల సొత్తు స్వాధీనం కాకినాడ క్రైం : అతను ఇంజినీరింగ్‌లో పీజీ పూర్తిచేశాడు. పలు ఉద్యోగాలకు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. ఇంటివద్దే ఉంటూ యువత ఆదాయం సంపాదించుకోవచ్చంటూ పేపర్లలో ప్రకటనలు ఇచ్చి పలువురిని మోసగించి, చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కాకినాడ రెండో పట్టణ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. అతడి వద్ద నుంచి పోలీసులు రూ.12 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. మోసగించే విధానం ఇదీ.. తొండంగి మండలం, వేమవరానికి చెందిన మారేటి శ్రీనివాసరావు (24) అలియాస్ (ఈశ్వర్, రామిరెడ్డి) హైదరాబాద్‌లో ఎంటెక్ చేశాడు. సులువుగా అడ్డదారిన డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకు పెళ్లికాని ఆశావహులు, యువతను ఎంచుకున్నాడు. వివాహ పరిణయ వేదిక మ్యారేజ్ బ్యూరోను 2014లో ఈశ్వర్ పి. వెంకటరామిరెడ్డి అనే పేరుతో ప్రారంభించాడు. భర్తలేని భార్యకు రెండో పెళ్లి అని... పీటలమీద పెళ్లి ఆగిపోయిందని ఎక్కువ మొత్తంలో కట్నం ఇస్తామని... కులమతాలతో ప్రసక్తి లేదంటూ ఇలా రకరకాల ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి, అందమైన యువతుల ఫొటోలను చూపించి యువకులను ఆకర్షించేవాడు. శ్రీనివాసరావు మాయలో పడిన యువకుల నుంచి ప్రాసెసింగ్ ఖర్చుల కోసమంటూ రూ.10 వేల వరకూ వసూలు చేసేవాడు. టెలికాలర్ ఉద్యోగం పేరిట నెలకు రూ.12 వేల వరకూ ఆదాయం గడించవచ్చంటూ ప్రకటన లిచ్చి నిరుద్యోగ యువత నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. బాధితుల నుంచి ఆధార్, ఏటీఎం కార్డులతో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకునేవాడు. ఇలా తీసుకున్న ప్రూఫ్స్‌తో వారి పేరుతో íసిమ్ కార్డులు తీసుకునేవాడు. వివాహాల కోసం, టెలికాలర్ ఉద్యోగం కోసం కట్టిన డబ్బులను తన ఖాతాలో డిపాజిట్ చేసుకోకుండా తన సంస్థలో టెలి కాలర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఖాతాల్లో వారికి తెలియకుండా డిపాజిట్ చేయించేవాడు. ఏటీఎం కార్డులతో వారికి తెలియకుండానే డబ్బులు డ్రా చేసేవాడు. ఒక్కో యువకుడితో ఒక నకిలీ సిమ్ కార్డుతో సంభాషణ సాగించి, పనిపూర్తయ్యాక ఆ సిమ్ తొలగించేవాడు. ఇలా ఇతను గుంటూరు నుంచి కృష్ణా, విజయవాడ, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల నుంచే కాక తమిళనాడులోని కొంతమంది బాధితులను మోసగించినట్టు పోలీసుల తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాకినాడ రెండో పట్టణ పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు అనేక మార్గాల్లో అన్వేషించారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, సీసీ పుటేజీ వివరాలు, డబ్బు చెల్లించిన ఖాతాలను పరిశీలించగా పోలీసులు ఆధారాలు దొరికాయి. ఎట్టకేలకు కాకినాడ జగన్నాథపురం ఆంధ్రా బ్యాంకులో ఓ మహిళ ఖాతాకు రూ.4.50 లక్షల డిపాజిట్ అయినట్టు గుర్తించి, విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడిందని డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరించారు. నిందితుడ్ని అతడి స్వగ్రామం వేమవరంలో పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి ఎస్టీమ్ కారు, స్కూటర్, 9 బంగారు ఉంగరాలు, 2 బంగారు చైన్లు, 50 నకిలీ సిమ్‌కార్డులు, 10 సెల్ఫోన్లు, 15 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. సమావేశంలో సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వంశీధర్ పాల్గొన్నారు.