
యశవంతపుర : అతనికి ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తాజాగా మరో యువతిని ప్రేమపేరుతో ముగ్గులోకి దింపి పెళ్లికి సిద్ధమయ్యాడు. అతనికి ఇదివరకే వివాహమైనట్లు తేలడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోలారుకు చెందిన యువతి బెంగళూరులో గార్మెంట్స్ సంస్థలో పని చేస్తుంది. అదే సంస్థలో పని చేస్తున్న ప్రవీణ్‌ను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు యువతి తల్లిదండ్రులను అతను సంప్రదించాడు. ఆ యువతికి అప్పటికే నిశ్చితార్థం జరిగినందని చెప్పగా వారిని మభ్య పెట్టి ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేయించాడు. అనంతరం ప్రవీణ్, ఆ యువతి ఒకే ఇంటిలో నివాసం ఉండసాగారు. తనను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని ఆ యువతి అడగ్గా అప్పుడు ఇప్పుడూ అంటూ మభ్య పెట్టాడు. కాగా ప్రవీణ్‌కు రెండు వివాహాలు అయ్యాయని, మొదట భార్యకు కుమారుడు కూడా ఉన్నాడని తెలియడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment