
ప్రతీకాత్మక చిత్రం
బీజింగ్ : చైనా ప్రభుత్వం పెద్ద కార్యక్రమమే చేపట్టింది. ప్రభుత్వ ప్రచారంలో భాగంగా ఇంటర్నెట్ నుంచి 2.79 లక్షల లైంగిక కార్టూన్లను చైనీస్ అధికారులు తొలగించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం..జనవరిలో ప్రారంభించిన ఈ ప్రచారంలో భాగంగా పోర్నోగ్రఫీకి సంబంధించి 1079 ఆన్‌లైన్ ఖాతాలను కూడా మూసివేశారు.
పోర్నోగ్రఫిక్ వీడియోల్లో ఎక్కువగా చిన్నపిల్లల చిత్రాలు ఉండటం..వాటి ప్రభావం వల్ల చిన్నపిల్లలపై లైంగిక దాడులు ఎక్కువ అవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లల పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ను తొలగించాలని చైనీస్ ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజాలు బైదు, టెన్‌సెంట్, యౌకూలకు కూడా చైనీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment