ధ్వంసమైన డీసీఎం వ్యాన్
చాంద్రాయణగుట్ట: బ్రేకులు ఫెయిలై డీసీఎం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎస్సై మోజీరాం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఫారూఖ్‌నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గురువారం సాయంత్రం ఛత్రినాకలో ప్రయాణికులను దింపి....కందికల్ ఆర్‌వోబీ దిగువన యూటర్న్ తీసుకుంటుండగా బియ్యం లోడ్‌తో వస్తున్న డీసీఎం వ్యాన్ బ్రేక్‌లు పెయిల్ కావడంతో బస్సును వెనుక వైపు ఢీ కొట్టింది. ఈ ఘటనతో బస్సు కండక్టర్ నరేష్ తలకు స్వల్ప గాయమైంది. క్యాబిన్‌లో ఇరుక్కుని డీసీఎం బురాన్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్రినాక పోలీసులు, ఫలక్‌నుమా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన వారిని బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment