జగిత్యాల: తన భూమి పట్టా చేయడం లేదంటూ సోమవారం ఓ రైతు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు ఆస్పత్రికి తరలించగా, రాత్రి చనిపోయాడు. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన చిట్యాల గంగయ్య 2001లో 210 సర్వేనంబరులో 1.20 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన జితేందర్‌రెడ్డి వద్ద సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశాడు.
ఇటీవల పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, భూమి అమ్మిన వ్యక్తి చనిపోవటంతో ఆయన కుటుంబసభ్యులు సదరు భూమి తమదేనని చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సోమవారం గంగయ్య తన భార్య సుశీలతో కలిసి ప్రజావాణికి వచ్చాడు.
కలెక్టర్‌కు దరఖాస్తు ఇచ్చిన అనంతరం అందరి ముందే వెంటతెచ్చుకున్న క్రిమిసంహారక మందు డబ్బా తీసి తాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది, ఏవో మహేశ్ బాధితుడిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా, రాత్రి గంగయ్య చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment