
అడ్డాకుల: తనకు ఆస్తి పంచాలంటూ వేధిస్తున్న పెద్ద కుమారుడిని చిన్న కుమారుడితో కలసి హత్య చేశాడో తండ్రి. ఇద్దరూ కలసి మృతదేహాన్ని నదిలో పడేసేం దుకు వెళుతుండగా పోలీసులకు పట్టుబ డ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని పరిగి రోడ్డులో నివాస ముండే రంగవల్లి రామస్వామి గౌడ్‌కు యాద గిరి (35), చిన్న కుమారుడు శ్రీని వాస్ సంతానం. ఇద్దరూ ఆటోలు నడుపుతున్నారు. అయితే, మద్యా నికి బానిసైన యాదగిరి.. తనకు ఆస్తి పంచివ్వాలని కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటంతో రామస్వామి ఇద్దరు కోడళ్లు పుట్టింటికి వెళ్లిపో యారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని యాదగిరి తండ్రి తో గొడవకు దిగాడు. అందుకు ఆయన నిరాకరిం చడంతో తండ్రిని చితక బాదాడు. ఈ విషయాన్ని ఆయన చిన్నకుమారుడికి చెప్పాడు.
దీంతో వారిద్దరూ కలసి యాదగిరిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. రాత్రి పక్క గదిలో ఉన్న యాదగిరి తలపై తండ్రి రామస్వామి బలంగా కొట్టడంతో కింద పడిపోయాడు. వెంటనే చిన్న కొడుకు పెట్రోల్ పోయగా తండ్రి నిప్పంటించాడు. మంటలకు తాళలేక యాదగిరి అక్కడే చనిపోయాడు. అయితే, మృతదేహాన్ని కృష్ణానదిలో పడేయడానికి శ్రీనివాసులు నడిపే ట్రాలీ ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు వద్ద పెట్రో లింగ్‌కు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ అమర్‌నాథ్ వారిని ఆపి పరిశీలించగా విషయం బయటపడింది. గాయా లపాలైన తండ్రి రామస్వామిని జిల్లా ఆస్పత్రికి తరలించడంతోపాటు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ బాలరాజు, ఎస్‌ఐ ఆర్.మధుసూదన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment