
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కడలూరులో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రంలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందగా, ఓ విద్యార్థి గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ప్లస్ టూ పరీక్షలు ముగిసిన ఆనందంలో 9 మంది విద్యార్థులు సముద్రంలో ఈతకు వెళ్లారు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా.. భారీ అలల తాకిడికి నలుగురు విద్యార్థులు నీటిలో మునిగి మరణించారు. ఒక విద్యార్థి సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ ప్రమాదంలో మిగిలిన నలుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment