
నిందితుడు వెంకట్రాములు
సంతోష్‌నగర్: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ఏఈ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంఘటన కంచన్‌బాగ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. డివిజన్ పరిధిలోని సలాల ప్రాంతంలో సబీల్ ఉస్ సాలం వద్ద సీసీ రోడ్డు వేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్ గులాం రిజ్వాన్ ఫారూఖీ డివిజన్ ఏఈ వెంకట్రాములును కోరాడు. అందుకు అతను రూ.40 వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఫారూఖీ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు శుక్రవారం మధ్యాహ్నం హఫీజ్‌బాబానగర్ కమ్యూనిటీ హాల్ వద్ద కాంట్రాక్టర్ నుంచి ఏఈ వెంకట్రాములు రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment