విలేకర్లతో మాట్లాడుతున్న బాధితురాలు లక్ష్మి
మహబూబాబాద్: తెలియకుండా రెండు పెళ్లిళ్లు చేసుకొని తనను మూడో పెళ్లి చేసుకొని ఇప్పుడు మాతో సంబంధం లేదని బెదిరిస్తున్నాడని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పి.లక్ష్మి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనాను కలిసి తన గోడును విన్నవించింది. తనకు రక్షణ కల్పించాలని నా పిల్ల లకు న్యాయం చేయాలని బాధితురాలు కలెక్టర్‌కు వినతిపత్రంను అందజేసింది. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ తాను జిల్లా కేంద్రంలోని గుమ్ముడూర్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నాను. మానుకోటకు చెందిన నీరుటి వీరన్న మాయమాటలు చెప్పి మూడో పెళ్లి చేసుకున్నాడని అంతకు ముందే మొదటి పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాడని, ఆ తర్వాత రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని తెలిపింది. తనను మూడవ పెళ్లి చేసుకున్నాడని ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇప్పుడు నాకు సంబంధం లేదని అంటు బె దిరిస్తున్నాడని తెలిపింది. తన నుంచి రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని ఎస్పీకి కలెక్టర్‌కు వినతులు ఇవ్వడం జరిగిందని వివరిం చింది. భద్రాది జిల్లాలో వీరన్న కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నావు మా పరిస్థితి ఎమిటని నిలదీసినందుకు తీవ్రం గా కొట్టడంతో హన్మకొండలో కేసు పెట్టడం జరిగిందన్నారు. దళిత మహిళ అయిన నన్ను పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితి మరే ఆడపిల్లలకు రాకుండా వీరన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment