third marraige
-
నటి వనితపై విమర్శలు.. యువతి అరెస్ట్
సినిమా: నటి వనిత విజయకుమార్‌పై విమర్శలు గుర్తించిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలన నటిగా ముద్ర వేసుకున్న నటి వనితా విజయకుమార్ ఈ మధ్య పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె మూడో వివాహంపై పలువురి నుంచి పలు రకాల విమర్శలు వస్తున్నాయి. నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, నటి కస్తూరి అదేవిధంగా నిర్మాత రవీంద్రన్ వంటి వారు వనితపై విమర్శల దాడి చేస్తున్నారు. అదే విధంగా సూర్యదేవి అనే యువతి నటి వనిత విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను యూట్యూబ్‌లో విడుదల చేసింది. దీంతో వనిత కూడా వారిపై ఎదురుదాడికి దిగింది. అయినా సూర్యదేవి విమర్శలు చేస్తూనే ఉండడంతో వనిత ఆమెపై వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వడపళని మహిళా పోలీసులు సూర్యదేవిని బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. అయితే ఆమె వెంటనే గురువారం బెయిల్‌పై విడుదలైంది. సూర్యదేవి బెయిలుకు నటి కస్తూరి ప్రయత్నించింది. సూర్యదేవి అరెస్ట్ గురించి చేసిన వెంటనే ఆమెను ఎలాగైనా బెయిల్‌పై విడిపించాలని నటి కస్తూరి భావించిందట. దీంతో తన న్యాయవాది ద్వారా సూర్యదేవికి బెయిల్ వచ్చేలా చేసినట్లు కస్తూరి తెలిపింది. కాగా సూర్యదేవి బెయిల్‌పై స్పందించిన నటి వనిత పేర్కొంటూ సూర్యదేవి ఎలాంటి కారణాలు లేకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను చేసి తన మనసును గాయపరచిందని పేర్కొంది. అయితే ఆమె పిల్లల క్షేమం కోరి తాను ఆమెను రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేయడం లేదన్నారు. అందువల్ల సూర్యదేవి బెయిల్‌ను తాను వ్యతిరేకించడం లేదని చెప్పింది. అయితే ఇకపై అయినా సూర్యదేవి ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటుందని భావిస్తున్నారని పేర్కొంది. కాగా తన పెళ్లికి సంబంధించిన సమస్యను తాను చట్టపరంగా ఎదుర్కొంటానని వనిత చెప్పింది. -
నిత్య పెళ్లి కొడుకు అరెస్టు
తార్నాక: మేనమామ కుమార్తెను వివాహమాడి ఆరునెలలకే వదిలేశాడు, కొద్దికాలానికే మరో యువతిని పెళ్లిచేసుకుని వారం రోజులకే వదిలేశాడు. ముచ్చటగా మూడోపెళ్లికి సిద్దమైన ఓ యువకుడు పోలీసులకు దొరికిపోయిన సంఘటన ఓయూ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఓయూ ఎస్ఐ నర్సింగరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌జిల్లా, రాంపల్లికి చెందిన మహ్మద్ సోహేల్(24) ప్రైవేటు ఉద్యోగి. 2016లో అతను తన మేనమామ కుమార్తెను వివాహం చేసుకుని ఆరు నెలలకే వదిలేశాడు. అనంతరం పీర్జాదిగూడకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్న అతను కేవలం వారం రోజులు మాత్రమే కాపురం చేసి వదిలేశాడు. నెల రోజుల క్రితం లాలాపేటలో ఓ యువతిని చూసిన అతను ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి కుదుర్చుకున్నాడు. ఈనెల 23న ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడమేగాక వధువు తండ్రి నుంచి రూ.50వేలు కట్నంగా తీసుకున్నాడు. అయితే సదరు యువతి కుటుంబ సభ్యులు సోహెల్ గురించి వాకబుచేయగా, అతడికి ఇçప్పటికే రెండుపెళ్లిళ్లు జరిగినట్లు స్థానికులు చెప్పడంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి ఆగిపోవద్దని తమ్ముడిని పంపాడు.. ఆపై..
రాంచి : మూడో పెళ్లికి సిద్ధమైన ఓ ప్రబుద్ధుడిని రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తన స్థానంలో తమ్ముడిని పెళ్లి కొడుకుగా పంపి భారీ మూల్యమే చెల్లించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని కిరిబురు పట్టణ పోలీసు స్టేషను పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు... కరీమ్ అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత ఏడాది తిరగకుండానే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వీరిద్దరితో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో మూడో పెళ్లికి సిద్ధపడిన అతడు.. శుక్రవారం ఊరేగింపుగా బయల్దేరాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన కరీం భార్యలు ఫిర్యాదు చేయడంతో ఇంటి వద్దే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి ఆగిపోతే వధువు తరఫు వారు ఇచ్చిన డబ్బు తిరిగివ్వాల్సివస్తుందన్న కారణంగా తన స్థానంలో తమ్ముడిని పంపించాడు. అయితే మొదట వరుడిని కరీంగానే భావించిన వధువు బంధువులు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. పెళ్లి ఆపేయడంతో పాటు ఖర్చులు రూ. 2 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో కరీం సోదరుడు ఆ మొత్తం చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డాడు. కాగా ఈ విషయం గురించి ఆఫీసర్ ఇన్చార్జి పూనమ్ కుజూర్ మాట్లాడుతూ.. కౌన్సెలింగ్ తర్వాత కరీం తన భార్యలతో కలిసి జీవించేందుకు అంగీకరించాడని తెలిపారు. తనకు మూడో వివాహం చేసుకోవడం ఇష్టం లేదని.. తల్లి ఒత్తిడి మేరకే ఇలా చేశానని కరీం చెప్పినట్లు పేర్కొన్నారు. -
ముచ్చటగా విజయ్ మాల్యా మూడో పెళ్లి
-
నాకు న్యాయం చేయండి
మహబూబాబాద్: తెలియకుండా రెండు పెళ్లిళ్లు చేసుకొని తనను మూడో పెళ్లి చేసుకొని ఇప్పుడు మాతో సంబంధం లేదని బెదిరిస్తున్నాడని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పి.లక్ష్మి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనాను కలిసి తన గోడును విన్నవించింది. తనకు రక్షణ కల్పించాలని నా పిల్ల లకు న్యాయం చేయాలని బాధితురాలు కలెక్టర్‌కు వినతిపత్రంను అందజేసింది. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ తాను జిల్లా కేంద్రంలోని గుమ్ముడూర్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నాను. మానుకోటకు చెందిన నీరుటి వీరన్న మాయమాటలు చెప్పి మూడో పెళ్లి చేసుకున్నాడని అంతకు ముందే మొదటి పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాడని, ఆ తర్వాత రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని తెలిపింది. తనను మూడవ పెళ్లి చేసుకున్నాడని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇప్పుడు నాకు సంబంధం లేదని అంటు బె దిరిస్తున్నాడని తెలిపింది. తన నుంచి రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని ఎస్పీకి కలెక్టర్‌కు వినతులు ఇవ్వడం జరిగిందని వివరిం చింది. భద్రాది జిల్లాలో వీరన్న కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నావు మా పరిస్థితి ఎమిటని నిలదీసినందుకు తీవ్రం గా కొట్టడంతో హన్మకొండలో కేసు పెట్టడం జరిగిందన్నారు. దళిత మహిళ అయిన నన్ను పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితి మరే ఆడపిల్లలకు రాకుండా వీరన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
పవన్ కళ్యాణ్ పెళ్లిని ధృవీకరించిన రిజిష్ట్రార్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడవ పెళ్లి చేసుకున్నట్లు సబ్ రిజిష్ట్రార్ ధృవీకరించారు. ఈ ఏడాది సెప్టెంబరు 30న పవన్ కళ్యాణ్ - ఆస్ట్రేలియా మోడల్ మోడల్ అన్నా లెజ్నెవా (డానా మార్క్స్) వివాహం జరిగినట్లు ఎర్రగడ్డ సబ్ రిజిష్ట్రార్ బాసిత్ సిద్ధిఖీ తెలిపారు. ఆ తేదికి నెల రోజుల ముందు వారు ఇద్దరూ వివాహం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తాము నోటీసు జారీ చేశామని చెప్పారు. ఆ నెల రోజులలో వారి పెళ్లికి అభ్యంతరం తెలుపుతూ ఎటువంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. దాంతో సెప్టెంబర్ 30న వారికి వివాహం చేసినట్లు తెలిపారు. వారిది కులాంతర వివాహమని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ హిందు అని, అన్నా లెజ్నెవా క్రిస్టియన్ అని తెలిపారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారికి వివాహం చేసినట్లు ఆయన చెప్పారు. వివాహ ధృవీకరణ పత్రంలో కొణిదల పవన్ కళ్యాణ్ - అన్నా లెజ్నెవా అని వారి పేర్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్-లెజ్నెవా సహజీవనం చేస్తున్నట్లు ఏడాది క్రితమే బయటకు తెలిసింది. అప్పటి నుంచి వారికి సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను వారు ధృవీకరించలేదు. ఖండించలేదు. ఇప్పుడు ఈ ధృవీకరణతో వారి సహజీవనం, మూడవ పెళ్లి నిజమేనని స్పష్టమైంది. సినీ పరిశ్రమలో నటన పరంగా సంచలనాలు సృష్టించిన పవన్, పెళ్లి - సహజీవనం విషయంలో కూడా సంచలనాలు సృష్టించారు. మూడవ పెళ్లి మరో సంచలనం. పెళ్లి - సహజీవనం- మళ్లీ పెళ్లి - మళ్లీ సహజీవనం - మళ్లీ పెళ్లి ... ఇలా సాగిపోతోంది ఆయన జీవితం. పవన్ కళ్యాణ్ మొదట విశాఖకు చెందిన నందిని అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆమె నుంచి విడాకులు తీసుకున్న తరువాత ‘బద్రి' చిత్రంలో తన సరసన హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్‌తో సహజీవనం చేశారు. మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన ఆమె కూడా మొదట మోడల్‌గానే తన కెరీర్‌ను ప్రారంభించారు. 2000లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో సంచలనం. అప్పట్లో సహజీవనంపైన చాలా చర్చ కూడా జరిగింది. పవన్‌తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్‌తోనే ‘జానీ' సినిమాలో నటించారు. వీరిద్దరికీ పెళ్లి కాకముందే 2004లో అకీరా నందన్ పుట్టాడు. 2009లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్యా పుట్టింది. దాదాపు రెండేళ్ల నుంచి రేణుదేశాయ్-పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. రేణుదేశాయ్ దూరమైనప్పటి నుంచి పవన్ అన్నాలెజ్నెవాతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. 'తీన్మార్' చిత్రంలో పవన్ పక్కన అన్నాలెజ్నెవా ఒక పాటలో నటించారు. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. -
పవన్ కళ్యాణ్ మూడవ పెళ్లి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడవ పెళ్లి చేసుకోబోతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మూడో పెళ్లి చేసుకోవడం కోసం నగరంలోని ఒక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన దరఖాస్తు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. ఒక సినిమాలో తన సరసన నటించిన విదేశీయురాలైన ఓ మోడలే ఆ మూడవ వధువని తెలుస్తోంది. సినీ పరిశ్రమలో నటన పరంగా సంచలనాలు సృష్టించిన పవన్, పెళ్లి - సహజీవనం విషయంలో కూడా సంచలనం సృష్టించారు. మూడవ పెళ్లి మరో సంచలనం. తనకిష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం పవన్‌కు అలవాటు. పెళ్లి - సహజీవనం- మళ్లీ పెళ్లి - సహజీవనం - మళ్లీ పెళ్లి ... ఇలా సాగిపోతోంది ఆయన జీవన శైలి. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని నుంచి విడాకులు తీసుకున్న తరువాత తన సరసన హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్‌తో సహజీవనం చేశారు. మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన ఆమె కూడా మొదట మోడల్‌గానే తన కెరీర్‌ను ప్రారంభించారు. 2000లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి' చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో సెన్సేషన్. పవన్‌తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్‌తోనే ‘జానీ' సినిమాలో నటించారు. వీరిద్దరికీ పెళ్లి కాకముందే 2004లో అకీరా నందన్ పుట్టాడు. 2009లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్యా పుట్టింది. దాదాపు రెండేళ్ల నుంచి రేణుదేశాయ్-పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవలే వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నట్లు తెలిసింది. రేణుదేశాయ్ దూరమైనప్పటి నుంచి పవన్ ఆ నటితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. వారికి ఒక ఆడ పిల్ల కూడా పుట్టినట్లు తెలుస్తోంది. ఒక నెలలో పవన్ మూడవ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. s.nagarjuna@sakshi.com