
పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడవ పెళ్లి చేసుకోబోతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మూడో పెళ్లి చేసుకోవడం కోసం నగరంలోని ఒక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన దరఖాస్తు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. ఒక సినిమాలో తన సరసన నటించిన విదేశీయురాలైన ఓ మోడలే ఆ మూడవ వధువని తెలుస్తోంది. సినీ పరిశ్రమలో నటన పరంగా సంచలనాలు సృష్టించిన పవన్, పెళ్లి - సహజీవనం విషయంలో కూడా సంచలనం సృష్టించారు. మూడవ పెళ్లి మరో సంచలనం. తనకిష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం పవన్కు అలవాటు. పెళ్లి - సహజీవనం- మళ్లీ పెళ్లి - సహజీవనం - మళ్లీ పెళ్లి ... ఇలా సాగిపోతోంది ఆయన జీవన శైలి.
పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని నుంచి విడాకులు తీసుకున్న తరువాత తన సరసన హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్తో సహజీవనం చేశారు. మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన ఆమె కూడా మొదట మోడల్‌గానే తన కెరీర్ను ప్రారంభించారు. 2000లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి' చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో సెన్సేషన్. పవన్తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్తోనే ‘జానీ' సినిమాలో నటించారు. వీరిద్దరికీ పెళ్లి కాకముందే 2004లో అకీరా నందన్ పుట్టాడు. 2009లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్యా పుట్టింది.
దాదాపు రెండేళ్ల నుంచి రేణుదేశాయ్-పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవలే వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నట్లు తెలిసింది. రేణుదేశాయ్ దూరమైనప్పటి నుంచి పవన్ ఆ నటితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. వారికి ఒక ఆడ పిల్ల కూడా పుట్టినట్లు తెలుస్తోంది. ఒక నెలలో పవన్ మూడవ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు.
s.nagarjuna@sakshi.com