బండరాయితో మోది భార్యను దారుణంగా .. | A Husband Brutally Murdered His Wife with a Rock | Sakshi
Sakshi News home page

బండరాయితో మోది భార్యను దారుణంగా..

Published Fri, Jun 21 2019 10:41 AM | Last Updated on Fri, Jun 21 2019 12:11 PM

A Husband Brutally Murdered His Wife with a Rock - Sakshi

సాక్షి, నాగార్జునసాగర్‌ : కుటుంబ కలహాలతో విసిగివేసారిన ఓ భర్త బండరాయితో మోది భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నాగార్జునసాగర్‌లో గురువారం వెలుగులోకి వచ్చిం ది.సాగర్‌ ఎస్‌ఐ సీనయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పెద్దగూడేనికి చెందిన తలసాని శరత్‌రెడ్డి నాగార్జునసాగర్‌కు చెందిన ప్రియాంక(25)ను నాలుగేళ్ల క్రితం ప్రేమిం చి కులాంతర వివాహం చేసుకున్నాడు. సాగర్‌లోనే కాపురం పెట్టారు. శరత్‌రెడ్డి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా ప్రియాంక గృహిణిగా ఉంటోంది. 

ఆరు మాసాలకే కలహాలు
వివాహం జరి.గిన ఆరు మాసాలకే దంపతుల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. నిత్యం కూలి డబ్బులతో వచ్చిన సంపాదన అవసరాలకు సరిపోక ఆర్థిక ఇబ్బందులతో గొడవలు జరిగాయి. తననే వేధింపులకు గురిచేస్తున్నాడని ప్రియాం క, నన్నే టార్చర్‌ పెడుతోందంటూ శరత్‌రెడ్డి పలుమార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. దీంతో ఇద్దరికి పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించినా ఫలితం లేక పెద్ద మనుషుల్లో కూడా పంచాయితీలు చేసుకుని ఒక్కటయ్యారు. 

బయటికి తీసుకెళ్లి..
పలుమార్లు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించినా, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా దంపతుల తీరు మారకుండా చీటికిమాటికి గొడవపడుతుండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి శరత్‌రెడ్డి బయటికి వెళ్దామని ప్రియాంకతో చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి ఆటోలో ఓ హోటల్‌కు వెళ్లారు. అనంతరం అక్కడినుంచి నడుచుకుంటూ పైకి వచ్చి మత్స్యకారులు జలాశయం తీరానికి వెళ్లే దారిలో గుట్టలలోకి వెళ్లారు. అక్కడే మాటమాట పెరగడంతో ప్రియాం కను బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం గురువారం ఉదయం పోలీసుల వద్దకు వెళ్లి తన భార్యను హత్య చేశానని శరత్‌రెడ్డి లొంగిపోయాడు. దీంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement