nagarjun sagar constituency
-
‘సాగర్’ ప్రచారానికి తెర.. పోలింగ్‌పై పార్టీల దృష్టి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారానికి గురువారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. శనివారం పోలింగ్ జరగనుండటంతో అభ్యర్థులు, స్థానిక నేతలు బూత్ స్థాయిలో ఏజెంట్ల నియామకం, సమన్వయంపై దృష్టి సారించారు. సామాజికవర్గాల ఓట్లను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయి. గత 17న సాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన నాటి నుంచే నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలవగా, సుమారు 20 రోజులుగా అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. ప్రధాన రాజకీయ పక్షాల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ముందస్తుగా ప్రకటించగా, టీఆర్ఎస్, బీజేపీ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఉత్కంఠకు దారితీసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు అవకాశం దక్కగా, బీజేపీ నుంచి డాక్టర్ రవినాయక్ బరిలోకి దిగారు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో నోముల నర్సింహయ్య మరణించగా, టీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలను ముందుగానే ప్రారంభించింది. అభ్యర్థి ఎంపికతో సంబంధం లేకుండానే నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నేతలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహించిన టీఆర్ఎస్, ప్రచార గడువు దగ్గరపడే కొద్దీ గ్రామ స్థాయి మీటింగ్‌లకు ప్రాధాన్యతనిచ్చింది. వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న హాలియాలో జరిగిన బహిరంగ సభకు హాజరై పార్టీ ఎన్నికల ప్రచారానికి మరింత ఊపుతెచ్చారు. సర్వశక్తులూ కూడగట్టుకున్న కాంగ్రెస్ ఇదే నియోజకవర్గం నుంచి గతంలో రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి జానారెడ్డి మరోమారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే గ్రామాలను చుట్టివచ్చిన జానారెడ్డికి మద్దతుగా నామినేషన్ల తర్వాత పార్టీ రాష్ట్ర నేతలు, కేడర్ కూడా ప్రచారంలో కలసి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, శాసనసభా పక్షం నేత భట్టి విక్రమార్కతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ప్రచార బాధ్యతలు స్వీకరించారు. బహిరంగ సభల జోలికి వెళ్లకుండా గ్రామ స్థాయి ప్రచారానికి కాంగ్రెస్ నేతలు పరిమితమయ్యారు. గతంలో జానారెడ్డి చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో జానారెడ్డి అసెంబ్లీలో ఉండాల్సిన అవసరాన్ని పదే పదే ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం కూడా సాగర్ చేరుకుని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. చాపకింద నీరులా బీజేపీ ప్రచారం చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై గోప్యత పాటించిన బీజేపీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ రవి నాయక్‌ను బరిలోకి దించింది. కాగా, పార్టీ టికెట్ ఆశించిన కడారి అంజయ్య యాదవ్.. టీఆర్ఎస్లో చేరగా, 2018లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నివేదిత రెడ్డి కొంతకాలం ప్రచారానికి దూరంగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతితో పాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ఛుగ్‌తో పాటు కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ కూడా ప్రచారానికి వచ్చారు. అయితే బీజేపీ బహిరంగ సభల జోలికి వెళ్లకుండా రోడ్‌షోలు, గ్రామ స్థాయి ప్రచారానికి పరిమితమైంది. చదవండి: తెలుగు యువకుడికి రూ.కోటిన్నర వేతనం -
‘కేసీఆర్, జానారెడ్డిలు తోడుదొంగలే..’
హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాకతో నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారం మరింత జోరందుకుంది. హాలియాలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రచార సభను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రచార సభలో సీఎం ప్రసంగం పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉందని విమర్శించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు . ఈ విషయం కేసీఆర్ కళ్లల్లో స్పష్టంగా కన్పిస్తోందని విజయశాంతి తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా విజయశాంతి విమర్శించారు. కేసీఆర్, జానారెడ్డిలు తోడు దొంగలని, వారు మంచి మిత్రులనే విషయాన్ని గుర్తుచేశారు. ఒప్పందం ప్రకారమే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిని సరైన సమయంలో ప్రజల ముందు ఉంచుతామని విజయశాంతి తెలిపారు. హాలియాలో జరిగిన ప్రచార సభలో సీఎం పోడు భూముల సమస్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలకాయలు చావు నోట్లో ఉన్నాయని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ జయంతికి కనీసం నివాళులర్పించలేని పరిస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా, సీఎం కేసీఆర్ దొంగ నిరాహార దీక్ష వలన తెలంగాణ రాలేదని అభిప్రాయపడ్డారు. ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. చదవండి: సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: కేసీఆర్ -
అంత్యక్రియల సమయంలో.. అన్నయ్యా.. మమ్మీ, డాడీ ఎక్కడ?
-
మమ్మీ,డాడీ ఇక రారా అన్నయ్యా?
నాగార్జునసాగర్: వారిది తెలిసీతెలియని వయస్సు.. తాము తల్లిదండ్రులను కోల్పోయామన్న స్పృహ వారికి లేదు. తల్లి అంత్యక్రియల సమయంలో.. అన్నయ్యా.. మమ్మీ, డాడీ ఎక్కడ? ఇక వారు ఇంటికి రారా?.. ఏమైందంటూ రెండేళ్ల చిన్నారి బరువెక్కిన హృదయంతో అమాయకంగా అడిగిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో నాగార్జునసాగర్‌కు చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు వెన్నం రవికుమార్ (31) ఆత్మహత్య చేసుకోగా.. ఒకరోజు ముందు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అతని భార్య అక్కమ్మ (25) బుధవారం శవమై కనిపించింది. వివరాలు.. నందికొండ మున్సిపాలిటీలోని హిల్‌కాలనీకి చెందిన వెన్నం రవికుమార్ (31) పెద్దవూర మండలం తుమ్మచెట్టు తండాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పాఠశాలలు మూసివేయడంతో వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అక్కమ్మ సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవికుమార్.. మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి బుగ్గవాగు సమీపంలో కాల్వ ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అక్కమ్మదిగా గుర్తించారు. అక్కమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోజే (సోమవారం) కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయ్యో.. పాపం రవికుమార్, అక్కమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. బాబుకు మూడేళ్లు, పాపకు రెండేళ్ల వయస్సు. గురువారం తల్లి అంత్యక్రియలు జరుపుతున్న సమయంలో పిల్లలను పక్కనే ఉంచారు. ఆ సమయంలో ‘అన్నయ్యా.. మమ్మి,డాడీ ఎక్కడ? అంటూ చిన్నారి అమాయకంగా అడగడంతో అక్కడున్న వారు చలించిపోయారు. దేవుడు చిన్న పిల్లలకు ఇదేమి పరీక్ష పెట్టాడంటూ కన్నీటిపర్యంతమయ్యారు. చదవండి: భర్త వద్దకు తీసుకెళ్తానని చిత్రహింసలు -
నాగార్జున సాగర్: ప్రైవేట్ టీచర్ రవి భార్య ఆత్మహత్య
సాక్షి, నల్లగొండ: లోకం తెలియని చిన్నారులు.. అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ.. నాన్నతో కలిసి ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వారు. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ చిన్నారులపై విధి పగబట్టింది. కరోనా రూపంలో వారిని కాటేసింది. కోవిడ్ వల్ల ఏడాదిగా ఉద్యోగం లేక.. ఆర్థిక సమస్యలు పెరగడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా ఇంట్లో ఒకటే ఏడుపు. ఏమైందో ఆ చిన్న బుర్రలకు అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం తెలిసింది. నాన్న ఇక ఎన్నిటికి రాడని. ఈ బాధ నుంచి కోలుకోక ముందే వారి ఇంటి మరో విషాదం చోటు చేసుకుంది. చిన్నారుల తల్లి కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఆ చిన్నారులను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. బిడ్డల ముఖం చూసైన బతుకకపాయే అంటూ విలపిస్తున్నారు బంధువులు. నాగార్జున సాగర్‌లో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. రెండు రోజుల క్రితం ఆర్థిక సమస్యలు తట్టుకోలేక సాగర్ హిల్ కాలనీకి చెందిన ప్రైవేట్ టీచర్ రవి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు వారి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. రవి కుమార్ భార్య అక్కమ్మ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని అక్కమ్మ గురువారం నాగార్జున సాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దంపతులిద్దరి మరణంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. పసి బిడ్డలను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. బిడ్డల ముఖం చూసైనా బతుకకపాయే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ప్రైవేట్ టీచర్ ఆవేదన: సీఎం సారూ.. పస్తులుంటున్నం -
నాగార్జునసాగర్ లో జానారెడ్డి ఓటమి ఖాయం : మంత్రి తలసాని
-
హాట్‌హాట్‌గా ఓటు వేట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. ఓవైపు మండుటెండలు అదరగొడుతున్నా రాజకీయ పార్టీలు ప్రచారంలో భాగంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా తెల్లారిన దగ్గరి నుంచి చీకటి పడేంతవరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారపర్వంలో అధికార టీఆర్ఎస్ ఒకింత ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు కూడా శక్తిమేరకు ప్రయత్నం చేస్తున్నాయి. సాగర్‌లో పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తన టీంతో కలిసి విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, ఆయన తనయులకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా జట్టుగా గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా చూసుకుంటుండగా, బీజేపీ అభ్యర్థి రవినాయక్ స్థానిక నేతలతో కలిసి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ రెండ్రోజుల రోడ్‌షోకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, సీఎం కేసీఆర్‌తో మరోమారు బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా జనగర్జన తరహాలోనే మరోమారు బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈనెల 10 తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సాగర్‌కు వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. దీంతో మరో పది రోజులు గడువు ఉన్నా... ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కనుంది. 14న నిడమనూరులో సీఎం సభ! నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నాయి. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి.. భగత్ గెలుపు బాధ్యతలను తీసుకొని గ్రామాలను కలియ తిరుగుతున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ కూడా నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రతి రోజు గ్రామాలకు వెళ్లి కేసీఆర్ పాలనను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఇన్ఛార్జిలుగా నియమితులైన బయటి జిల్లాల ఎమ్మెల్యేలు తమకు అప్పగించిన టీంలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఐటీ మంత్రి కేటీఆర్ కూడా నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారనే ప్రచారం సాగర్ గులాబీ దండును ఉరకలు పెట్టిస్తోంది. దీంతోపాటు ముఖ్యమంతి కేసీఆర్ మరోమారు నియోజకవర్గంలో బహిరంగసభకు హాజరవుతారని, ఈ నెల 14న ఆయన నిడమనూరులో జరిగే సభలో పాల్గొంటారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఎండలను సైతం ఖాతరు చేయని, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భగత్ విజయం కోసం పట్టు వదలకుండా పని చేస్తున్నారు. టార్గెట్ జానా జానారెడ్డినే టార్గెట్ చేసి టీఆర్ఎస్ తమ ప్రచారం నిర్వహిస్తోంది. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, తెలంగాణ వచ్చాకే సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు ఇవ్వగలిగామని చెబుతోంది. జానారెడ్డి అనేక శాఖలకు మంత్రిగా పని చేసినా నియోజకవవర్గ ప్రజలను ఉద్దరించిందేమీ లేదని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం లేదంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు గులాబీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్కు దీటుగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి వ్యక్తిగత చరిష్మాపైనే ఆధారపడి ఉప ఎన్నికను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో టీఆర్ఎస్కు తీసిపోకుండా దూసుకెళ్తోంది. జానారెడ్డితో పాటు ఆయన తనయులు రఘువీర్, జయవీర్‌లు విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ తదితరులు నియోజకవర్గంలోనే ఉండి ఓటర్లను కలుస్తున్నారు. జానారెడ్డి అభివృద్ధి చేయలేదన్న టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నపుడే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ఒరిగిందేమీలేదని ఓటర్లకు చెప్పి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మండలాల వారీగా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉంది. అయితే సీఎం కేసీఆర్ సభ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిని బట్టి కాంగ్రెస్ సభ నిర్వహించాలా? వద్దా..? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీలు కోమటిరెడి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలు కూడా జానా ప్రచారానికి తోడు కానున్నారు. పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు సాగర్‌లోనే ఉండి జానా గెలుపు బాధ్యతలను భుజానవేసుకున్నారు. సర్దిచెప్పుకొని సమన్వయంతో ముందుకెళ్తున్న బీజేపీ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన అభ్యర్థిని కాదని కొత్త వ్యక్తి డాక్టర్ రవి నాయక్‌కు టికెట్ ఇవ్వడంపై మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తమైనా క్షేత్ర స్థాయి నాయకత్వానికి సర్ది చెప్పుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. ప్రస్తుతానికి స్థానిక నేతలలో కలిసి రవికుమార్ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల పార్టీలకు పోటీ ఇచ్చేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, టికెట్ ఆశించిన నివేదితా రెడ్డి కూడా తాజాగా ప్రచారంలో కలిసి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన స్వగ్రామం పలుగుతండాకు వెళ్లిన సందర్భంగా విలపించి వార్తల్లోకెక్కిన రవికుమార్ ఆ తరువాతి రోజున రూటు మార్చి డాన్స్‌లు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పార్టీలోని రాష్ట్ర స్థాయి, ద్వితీయ శ్రేణి నేతలను సాగర్‌లో ప్రచారానికి పంపించిన బీజేపీ ముఖ్యనేతలను రంగంలోకి దింపేందుకు చర్యలు చేపట్టింది. రవికుమార్ ఎన్నికల ప్రచారానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు తరలిరానున్నారు. ఈ మేరకు పార్టీ నాయకత్వం ప్రచార షెడ్యూలు ఖరారు చేస్తోంది. ఈనెల 10వ తేదీ తరువాత బండి సంజయ్ సాగర్‌లో మకాం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారితోపాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలను కూడా సాగర్‌కు తీసుకురావాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరో 38 మంది కూడా బరిలో ఉన్నా ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యే నెలకొంది. చదవండి:6 ఎమ్మెల్సీలు ఖాళీ.. కడియంకు మళ్లీ ఛాన్స్ ఉండేనా? -
అర్ధనగ్నంగా వచ్చి నామినేషన్ వేశాడు!
నల్లగొండ: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో పూస శ్రీనివాస్ అనే వ్యక్తి అర్ధనగ్నంగా వెళ్లి సాగర్ ఉపఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరఫున నామినేషన్ వేసేందుకు అతను రిక్షాపై అర్ధనగ్నంగా వచ్చి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నాడు. బనియన్, లుంగీతోనే కార్యాలయం లోపలికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా పూస శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యావంతుడినైన తనకు 49 సంవత్సరాల వయసు వచ్చినా ఉద్యోగం లేదన్నారు. తనలాంటి ఎందరో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి–భువనగిరి జిల్లాకు చెందిన తాను గతంలోనూ ఇదే డిమాండ్‌తో నామినేషన్ వేసినట్లు తెలిపారు. -
కమలంలో ‘సాగర్’ లొల్లి.. ఎందుకంటే!
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ నాయక్ ఎంపిక కమలదళంలో అసంతృప్తికి దారితీసింది. అభ్యర్థి రేసులో ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం తమను పట్టించుకోకపోవడం జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి.. సతీమణి నివేదిత (గత ఎన్నికల్లో పోటీ చేశారు)తోపాటు పార్టీని నమ్ముకొని పనిచేసిన కడారి అంజయ్య యాదవ్‌కు ఆగ్రహం తెప్పించింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేయడంపట్ల మరికొందరు నేతలూ అసహనం వ్యక్తం చేస్తున్నారనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. రవిని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ అంజయ్య మంగళవారమే టీఆర్ఎస్లో చేరగా కంకణాల దంపతులు మౌనంగా ఉన్నా పార్టీ పెద్దలకు దూరంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. తెల్లారేసరికి టీఆర్ఎస్లోకి.. రవినాయక్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం సోమవారం రాత్రి ఖరారు చేయగా తెల్లారేసరికే నియోజకవర్గంలో పార్టీ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన కంకణాల శ్రీధర్‌రెడ్డి దంపతులు అటు పార్టీ కేడర్‌కు, ఇటు పార్టీ పెద్దలకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక అంజయ్య యాదవ్ అయితే ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని ఎర్రవెల్లిలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. తనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోతే యాదవ సామాజికవర్గానికి చెందిన భగత్‌కు మద్దతిస్తానని అంజయ్య గతంలోనే చెప్పినట్లు తెలుస్తోంది. తనకు ఎలాగూ టికెట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు అధికారికంగా ఆయన టీఆర్ఎస్లో చేరి కార్పొరేషన్ చైర్మన్ హామీ దక్కించుకున్నారనే చర్చ కమలదళంలో జరుగుతోంది. అంజయ్యకు టికెట్ ఇస్తే యాదవ సామాజికవర్గానికి చెందిన ఓట్లు అదనంగా వచ్చేవని, పార్టీ మంచి జోష్‌లో ఉన్న నేపథ్యంలో ఆ ఓట్లు కూడా తోడయితే ఆయన గట్టిపోటీ ఇచ్చేవారని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ పెద్దలతో మాట్లాడేందుకు నిరాకరణ... కంకణాల శ్రీధర్‌రెడ్డి దంపతులకు సైతం టీఆర్ఎస్ గాలం వేసినట్లు సమాచారం. గులాబీ దళంలోకి రావాలని శ్రీధర్‌రెడ్డి, నివేదితలకు ఆహ్వానం అందిందని, అయితే వారు సున్నితంగా తిరస్కరించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తాము మొదటి నుంచీ సంఘ్ కార్యకర్తలుగా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని, టికెట్ ఇవ్వనందున అలక సాధారణమేనని, పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వారు సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉపఎన్నికలో రవికుమార్ పోటీలో ఉన్నా రెండున్నరేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో తమకు పార్టీ అవకాశం ఇస్తుందనే భరోసా కూడా వారు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కంకణాల దంపతులతో మాట్లాడేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ప్రకటిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాలను కూడా బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. -
సాగర్ ఉప ఎన్నిక: ఆ రెండు గ్రామాల్లోకి నో ఎంట్రీ!
నిడమనూరు: ‘‘మా ఊరిలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదు కాబట్టి రాజకీయ నాయకులు ఓట్ల కోసం మా ఊరికి రావొద్దు’’అంటూ నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని గగ్గినపల్లివారిగూడెం, కమ్మరిగూడెం ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామాలు వేంపాడ్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నాయి. ఆదివారం వేంపాడ్‌లోని ప్రధాని రహదారి వెంట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా ఈ గ్రామాలు ఉప ఎన్నిక జరుగనున్న నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలో ఉండటంతో గ్రామస్తుల నిరసనకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(టీఆర్ఎస్) ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. చదవండి: ‘సాగర్’.. సస్పెన్స్: పోటీదారులెవరో..? -
వ్యూహాత్మక అడుగులు.. ఆఖరి రోజే అభ్యర్థి ఖరారు?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమ సిట్టింగ్ స్థానమైన ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టుకునేందుకు అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కె.జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు. 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య సంచలన విజయం సాధించి జానా వరుస విజయాల పరంపరకు చెక్ పెట్టారు. నోముల హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తిరిగి ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని అధికార టీఆర్ఎస్.. సాగర్‌ను దక్కించుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను తన వైపునకు తిప్పుకోవాలని బీజేపీ .. ఇలా మూడుకు మూడు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి అభ్యర్థిత్వం మాత్రమే తేలగా.. టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఆఖరి రోజు అభ్యర్థి ప్రకటన..? నామినేషన్ల దాఖలుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. వివిధ రాజకీయ కారణాలు, సామాజిక కోణాలను పరిగణనలోకి తీసుకుంటున్న అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిని అదే రోజు ప్రకటించాలని చూస్తోందని పార్టీ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ ప్రకటించే అభ్యర్థిని బట్టి.. దానికి అనుగుణంగా తమ క్యాండెట్‌ను ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీలూ చివరి రోజు వరకు వేచి చూస్తాయేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ కోసం క్యూలో ఉన్నారు. వీరంతా కేవలం రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. నోముల నర్సింహయ్య తనయుడితో పాటు.. అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో పాటు అదే సామాజిక వర్గం నుంచి మరొకరు లైన్లో ఉన్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇస్తుందో చూసి.. దానికి భిన్నంగా మరో సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే.. తమకు లాభిస్తుందని బీజేపీ ఎదురు చూస్తోంది. దీంతో ఇరు పార్టీల అభ్యర్థుల ఖరారు, పేర్ల ప్రకటన చివరి రోజు వరకూ తేలేలా కనిపించడం లేదని విశ్లేషిస్తున్నారు. పార్టీలో అసంతృప్తులకూ చెక్ పెట్టే వ్యూహం టికెట్ ఆశించి భంగపడిన వారు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయకుండా.. అసంతృప్తులకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కూడా అభ్యర్థి ప్రకటనను ఆలస్యం చేయాలన్న వ్యూహంతోనే టీఆర్ఎస్ అధినాయకత్వం ఉందని పేర్కొంటున్నారు. టికెట్ రాని వారు బీజేపీ వైపు చూడకుండా అడ్డుకోవడంతోపాటు.. నామినేషన్ దాఖలు తర్వాత కేవలం రెండు వారాల సమయమే ప్రచారం మిగిలి ఉండడంతో రెబల్‌గా బరిలోకి దిగి అన్ని ఏర్పాట్లు చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చేయాలన్న ఎత్తుగడతోనే ఆలస్యం చేస్తారని పేర్కొంటున్నారు. ఒకవైపు బీజేపీకి అవకాశం ఇవ్వకుండా చూడడం.. మరో వైపు పార్టీలో అసంతృప్తులు, తిరుగుబాట్లు లేకుండా చూసుకోవడంతో అన్న రెండు ప్రయోజనాలు ఆశించే.. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనను ఆఖరి రోజు వరకూ చేయక పోవచ్చని అంటున్నారు. మరోవైపు అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ పార్టీ ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. దీనికోసం ఇప్పటికే జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు కూడా తీసుకుంది. నిఘావర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంది. అయినా.. తుది నిర్ణయానికి వచ్చే ముందో సారి జిల్లా ముఖ్యనేతలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీ ఒకటీ రెండు రోజుల్లో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. -
టీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావు
తిరుమలగిరి: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం నాగార్జునసాగర్‌లోని జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్, బీజేపీలు డిపాజిట్ల కోసం పోరాడాల్సిందేనన్నారు.(చదవండి: గోల్కొండపై జెండా ఎగరేద్దాం: బండి) ఎప్పటిలాగే ప్రజలను మాయమాటలతో మరోసారి మోసం చేసి ఓట్లు దండుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని, ఈసారి ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. తన హయాంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందే తప్ప ఈ ఆరేళ్ల కాలంలో అణువంత కూడా అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఎన్నికలప్పుడు మాత్రమే అధికార పార్టీకి హామీలు గుర్తుకువస్తాయని ఆయన విమర్శించారు. -
బండరాయితో మోది భార్యను దారుణంగా ..
సాక్షి, నాగార్జునసాగర్ : కుటుంబ కలహాలతో విసిగివేసారిన ఓ భర్త బండరాయితో మోది భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నాగార్జునసాగర్‌లో గురువారం వెలుగులోకి వచ్చిం ది.సాగర్ ఎస్ఐ సీనయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పెద్దగూడేనికి చెందిన తలసాని శరత్‌రెడ్డి నాగార్జునసాగర్‌కు చెందిన ప్రియాంక(25)ను నాలుగేళ్ల క్రితం ప్రేమిం చి కులాంతర వివాహం చేసుకున్నాడు. సాగర్‌లోనే కాపురం పెట్టారు. శరత్‌రెడ్డి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండగా ప్రియాంక గృహిణిగా ఉంటోంది. ఆరు మాసాలకే కలహాలు వివాహం జరి.గిన ఆరు మాసాలకే దంపతుల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. నిత్యం కూలి డబ్బులతో వచ్చిన సంపాదన అవసరాలకు సరిపోక ఆర్థిక ఇబ్బందులతో గొడవలు జరిగాయి. తననే వేధింపులకు గురిచేస్తున్నాడని ప్రియాం క, నన్నే టార్చర్ పెడుతోందంటూ శరత్‌రెడ్డి పలుమార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. దీంతో ఇద్దరికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించినా ఫలితం లేక పెద్ద మనుషుల్లో కూడా పంచాయితీలు చేసుకుని ఒక్కటయ్యారు. బయటికి తీసుకెళ్లి.. పలుమార్లు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించినా, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా దంపతుల తీరు మారకుండా చీటికిమాటికి గొడవపడుతుండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి శరత్‌రెడ్డి బయటికి వెళ్దామని ప్రియాంకతో చెప్పాడు. దీంతో ఇద్దరు కలిసి ఆటోలో ఓ హోటల్‌కు వెళ్లారు. అనంతరం అక్కడినుంచి నడుచుకుంటూ పైకి వచ్చి మత్స్యకారులు జలాశయం తీరానికి వెళ్లే దారిలో గుట్టలలోకి వెళ్లారు. అక్కడే మాటమాట పెరగడంతో ప్రియాం కను బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం గురువారం ఉదయం పోలీసుల వద్దకు వెళ్లి తన భార్యను హత్య చేశానని శరత్‌రెడ్డి లొంగిపోయాడు. దీంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
జానా.. నీ ఆటలు సాగనియ్యం : నోముల నర్సింహయ్య
సాక్షి, నాగార్జునసాగర్ : నియోజకవర్గంలో జానారెడ్డి ఆటలు ఇక సాగనీయమని టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. శుక్రవారం పైలాన్ కాలనీలో ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానారెడ్డిని గ్రామాలలోకి ప్రచారా నికి వెళితే నీ సేవలు ఇక చాలు గో బ్యాక్ అంటున్నారన్నారు. అయినా గెలుపు తమదేనని బీరాలు పలుకుతున్నాడని ఈసారి ఆ మాయలను సాగనివ్వవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ ప్రజలు తమకే మెజార్టీ ఇచ్చారని ఈసారి సాగర్ నుంచే ఐదు వేల మెజార్టీ ఇవ్వాలని కాలనీల వాసులను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతో సాగర్‌ను నంది కొండ పేరుతో మున్సిపాలిటీ చేశామని తమను గెలిపిస్తే ఈ మున్సిపాలిటీకి బొడ్రాయిగా ఉండి మీకు సేవచేస్తానని అన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ అభివృద్ధికిగాను రూ.20 కోట్లు మంజూరయ్యాయని కాలనీలలో అంతర్గత రోడ్లు, డ్రెనేజీ లు, నిత్యం తాగునీటి వసతి కల్పించేందుకు నిధులు ఖర్చు చేయవచ్చన్నారు. కాలనీలలోని ఎన్ఎస్పీ క్వార్టర్లను నామినల్ రేటుతో రెగ్యులర్ చేయించే బాధ్యత తమదేనన్నారు. ముస్లింలకు గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇప్పించే బాధ్యత తమదేనన్నారు. టీఆర్ఎస్లో చేరిక.. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మైనార్టీ నాయకులు గౌస్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్న బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నోముల నర్సింహయ్య సమక్షంలో పార్టీలో చేరారు. తిరుమలగిరి మండలం రంగుండ్లకు చెందిన 100 మంది కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బత్తుల సత్యనారాయణ, రామకృష్ణ, శేఖరాచారి, మసీదు రాము తదితరులు పాల్గొన్నారు. గుర్రంపోడు : తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని మొసంగి, తెరాటిగూడెం, ఎరడ్లగూడెం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఆదరించి మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయాలని అన్నారు. తెలంగాణాపై ఆధిపత్యం కొనసాగించేందుకు ఆంధ్రా పాలకులు ప్రయత్నిస్తున్నారని, ఓటుతో వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే అవకాశం తనకు ఇవ్వాలని అన్నారు. దశాబ్దాలుగా పదవులు అనుభవిస్తున్న వారు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గాలి రవికుమార్, ఎంపీటీసీల ఫోరం నియోజకవర్గ కార్యదర్శి పాశం గోపాల్‌రెడ్డి, నాయకులు జలగం సుదర్శన్‌రావు, మండల అధ్యక్షుడు గుండెబోయిన కిరణ్‌కుమార్ యాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బల్గూరి నగేష్‌గౌడ్, గజ్జెల చెన్నారెడ్డి, పొనుగోటి నర్సింహారావు, గోలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
‘లిఫ్ట్’ ఇచ్చేవారేరీ?
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఎత్తిపోతల పథకాల కింద రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎత్తిపోతల పథకాల నిర్వహణను కూడా ప్రభుత్వమే చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా ఎత్తిపోతల పథకాలకు 100 కోట్ల రూపాయలు కేటాయించి ఆధునికీకరించారు. కానీ నిర్వహణ భారం రైతులపై పడడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో 41 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వాటి పరిధిలో 83 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తరచుగా కాలిపోతున్న విద్యుత్ మోటార్లు, పగిలిపోతున్న పైపులతో పాటు ఆపరేటర్లను నియమించుకోవడం రైతులకు భారంగా మారింది. అయినా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరందడం లేదు. ఎన్నికల సమయంలో నాయకులు మాత్రం అధికారంలోకి వస్తే ఎత్తిపోతల నిర్వహణ భారం ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీలిస్తున్నారు కానీ ఆ హామీలు అమలు కావడం లేదు. బాబు హయాంలోనే లిఫ్ట్‌ల నిర్వీర్యం చంద్రబాబు నాయుడు హయాంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న 41 ఎత్తిపోతల పథకాలు కూడా నిర్వీర్యమయ్యాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించేది. కాగా ప్రభుత్వానికి అధిక భారమవుతుందని భావించిన బాబు ఎత్తపోతల పథకాలను రైతులే నిర్వహించుకోవాలని 1999లో ఆదేశాలు జారీ చేశారు. దాంతో మోటార్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లులు రైతులే చెల్లించుకోవాల్సి వచ్చింది. కాగా విద్యుత్ బిల్లులు ఒక్కొక్క లిఫ్ట్‌కు లక్షల రూపాయల్లో వచ్చేది. దాంతో విద్యుత్ బిల్లులు చెల్లించుకోలేని రైతులకు నిర్వహణ భారంగా మారడంతో ఎత్తిపోతల పథకాలు మూసివేయడంతో 80 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. రైతులు ఆర్థికంగా చితికిపోయారు. అప్పులు దొరకని స్థితిలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. వైఎస్ఆర్ హయాంలోరైతులకు మేలు 2004లో దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎత్తిపోతల కింద రైతులకు ఎంతో మేలు జరిగింది. ఆయన ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేయగా ఎత్తిపోతల రైతులకు కూడా వర్తింపజేశారు. అంతే కాకుండా ఎత్తిపోతల పథకాల విద్యుత్ చార్జీల బకాయిలు కూడా మాఫీ చేశారు. మరమ్మతులకు గాను 7 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అంతే కాకుండా 2006లో ఒక్కొక్క ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 16 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేశారు. ఎత్తిపోతల కింద ఉన్న 80 వేల ఎకరాల ఆయకట్టులో 80 శాతం ఆయకట్టు సాగులోకి వచ్చింది. దాంతో ఎత్తిపోతల రైతులకు మహర్దశ కలిగింది. భారమైన నిర్వహణ ఎడమ కాలువపై ఉన్న 41 ఎత్తిపోతల పథకాల నిర్వహణ రైతులకు భారంగా మారింది. ప్రత్యేక విద్యుత్ లైన్లు, ఆధునికీకరణలో నూతన మోటార్లు ఏర్పాటు చేసినా తరచుగా మోటార్లు కాలిపోవడంతో రైతులకు ఆర్థిక భారం తప్పడం లేదు. ఒక్కొక్క ఎత్తిపోతల పథకానికి ఇద్దరు ఆపరేటర్లను నియమించుకోవడంతో పాటు తరచుగా పలిగిపోతున్న పైపులు, కాలిపోతున్న మోటార్లను మరమ్మతులు చేయాలంటే రైతులు ఎకరానికి కొంత డబ్బులు వసూలు చేసి నిర్వహణ చేసుకుంటున్నారు. అయినా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువ చివరి భూములు బీడుగా మారుతున్నాయి. ఆపరేటర్లను నియమించాలి : మిర్యాలగూడ : లిఫ్ట్‌ల నిర్వహణకు ప్రభుత్వమే అవుట్ సోర్సింగ్ ద్వారా ఆపరేటర్లను నియమించాలి. రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఆధునీకరించి, నిర్వహణ చేపట్టకుండా వది లేస్తే ఆ ఫలితం అందే పరిస్థితి లేదు. రైతులు నిర్వహించే పరిసి ్థతి లేదు. దీంతో రైతులపై నిర్వహణ భారం పడుతుంది. రైతుల మధ్య సమన్వయం లోపించి లిప్టులు నడవని పరిస్థితి నెలకొంది. – దైద నాగయ్య, గోగువారిగూడెం నిధులు కేటాయించాలి .. మిర్యాలగూడ : లిఫ్ట్‌లను ఆధునికీకరించారు కానీ నిర్వహణ చేపట్టడం లేదు. మోటార్లు కాలిపోవడం, పైపులు పగిలిపోతున్నా ఎన్ఎస్పీ అధికారులు పట్టించుకోవడం లేదు. దాంతో రైతులకు భారంగా మారుతుంది. దీంతో పంటకు నీరందక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం లిఫ్ట్‌ల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ ప్రతి ఏటా కేటాయించాలి. – భిక్షం, రైతు, అన్నపురెడ్డిగూడెం రైతులపై అధిక భారం.. మిర్యాలగూడ : సాగర్ కుడి కాల్వపై ఉన్న లిఫ్ట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తే ఎడమకాల్వపై ఉన్న లిఫ్టులను రైతులు నిర్వహించుకోవాల్సి వస్తుంది. దీంతో రైతులపై అధిక భారం పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం లిఫ్టు నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే నిర్వహిస్తుందని హామీ ఇచ్చినా నేటి వరకు అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలి. – పసుల వెంకటయ్య, రావులపెంట, లిఫ్ట్ చైర్మన్ ప్రభుత్వమే నిర్వహించాలి.. నడిగూడెం : 15 సంవత్సరాలుగా ఎత్తిపోతల పథకాలను రైతులే శిస్తులు చెల్లించి నిర్వహించుకుంటున్నాం. అది కూడా రైతులు పూర్తి స్థాయిలో శిస్తులు వసూలు కావడంలేదు. దీంతో నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. సాగర్ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలి. –మొక్క రాంబాబు, సిరిపురం లిఫ్ట్ నిర్వహణ కమిటీ వేయాలి.. మేళ్లచెరువు : వెల్లటూరు లిప్టు నిర్వహణ సక్రమంగా లేక పం టలు ఎండిపోయే పరిస్థితి ఉంది. లిఫ్ట్ నిర్వహణకు కమిటీ వేయాలి. వాటి మరమ్మతులకు నిధులు లేక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పంటలు పూత, పిందె సమయంలో నిర్వహణ లోపంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – కర్నాటి నారాయణరెడ్డి ,మేళ్లచెరువు హామీని అమలు చేయాలి.. తిరుమలగిరి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కాని నేటికీ అది అమలు కాలేదు. ఆయకట్టు రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుంది. ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వమే పూర్తిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. – పల్రెడ్డి రఘుమారెడ్డి రైతు, అల్వాల హాలియా సభలో హామీ ఇవ్వాలి.. తిరుమలగిరి : తెలంగాణ వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నా లిప్టులపై ప్రభుత్వం చొరవ చూపకపోవడం బాధాకరం. లిప్టులను రైతులే నిర్వహించుకోవడంతో చాలా భారం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తెలంగాణ వస్తే ఎడమకాలువపై ఉన్న లిప్టులను ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నేటికి అమలు కాలేదు. ఈనెల 27న హాలియాలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ రైతలకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. – నాంపల్లి సైదులు, అల్వాల లిఫ్ట్ రైతులను ఆదుకోవాలి.. నిడమనూరు : ఎత్తిపోతల పథకాల కింది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లిఫ్ట్ ఆపరేటర్లకు, మోటార్లు చెడిపోయినప్పుడు చేసే మరమ్మతులకు, కాలువల మరమ్మతులకు, రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. అసలే మెట్ట పంట వేసే రైతులపై ఆ భారం ఎక్కువగా ఉంటుంది. పూర్తి నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వమే స్వీకరించాలి. – పిల్లి రాజు, రైతు, నిడమనూరు ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలి.. మేళ్లచెరువు : మండలంలోని రేవూరు, వేపలమాధవరం, మేళ్లచెరువు గ్రామాల్లోని పంట పొలాలకు నీటిని అందించే వెల్లటూరు లిఫ్ట్‌ను ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలి. మోటారు, పైపులైన్, విద్యుత్ వంటి సమస్యలు, మరమ్మతులు వంటి వాటిని ప్రభుత్వమే భరించాలి. మరమ్మతులకు నిధులు కేటాయించాలి. – జె.గురవయ్య యాదవ్, రేవూరు రైతుల నుంచే ఖర్చులు వసూలు.. మునగాల : సాగర్ ఎడమ కాల్వపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నిర్వహణ రైతులకు భారంగా మారింది. ప్రతి ఏడాది విద్యుత్ మోటార్లు మరమ్మతులకు గురికావడం, సిబ్బంది జీతాలు తదితర ఖర్చులు రైతుల నుంచి వసూలు చే యాల్సి వస్తుంది. – మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ఎత్తిపోతల పథకం చైర్మన్, కొక్కిరేణి -
నా గెలుపు.. చరిత్రలో నిలిచిపోవాలి
సాక్షి, నిడమనూరు (నాగార్జునసాగర్): నాగార్జునసాగర్‌లో తన గెలుపు ఉమ్మడి ఏపీలో చరిత్రగా నిలిచిపోవాలని, ఆవిధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి సోమవారం నామినేషన్ వేసిన అనంతరం మాట్లాడారు. ప్రస్తుతం పదో సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, మొదటి సారి అనుభవం లేక, రెండోసారి ప్రయోగానికి పోతే ప్రజలు అర్థం చేసుకోలేక ఓడించారన్నారు. మిగతా అన్ని దఫాలు అఖండ మెజారిటీతో నియోజకవర్గ ప్రజలు గెలిపించి రాష్ట్ర నాయకుడిగా ఎదిగేలా చేశారన్నారు. ఇప్పటికే 7సార్లు గెలిపించిన ప్రజలు మరోసారి గెలిపిస్తే 8సార్లు ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన చరిత్ర ఉంటుందన్నారు. కార్యక్రమంలో మహాకూటమి నాయకులు కడారి అంజయ్య(టీడీపీ), పొదిల్ల శ్రీనివాస్(సీపీఐ), కంచి శ్రీనివాస్(టీజేఎస్), కాంగ్రెస్ నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, యడవెల్లి రంగగశాయిరెడ్డి, చేకూరి హన్మంతరావు, అంకతి సత్యం, మర్ల చంద్రారెడ్డి, శంకర్‌నాయక్, ఉన్నం శోభ, ఉన్నం చినవీరయ్య, వెంకటయ్య, పిల్లి రాజు, పగిల్ల శివ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కోసం సీట్ల పంపిణీ: మిర్యాలగూడ : రాష్ట్రంలో ప్రజలకు సామాజిక న్యాయం అందించడానికి మహాకూటమిలో సీట్లు పంపిణీ చేసినట్లు కుందూరు జానారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో పాటు బీసీ సంఘాలు కూడా ఉన్నాయన్నారు. అందరు కలిసి ఆర్.కృష్ణయ్యను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగయ్య, దైద సంజీవరెడ్డి, కందిమళ్ల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జానారెడ్డి ఓటమి ఖాయం
సాక్షి, త్రిపురారం : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కుందూరు జానారెడ్డిని ఓటమి ఖాయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం హాలియాలోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ దొంగలు మళ్లీ చంద్రబాబును తీసుకొని తెలంగాణ రాష్ట్రంపై దండయాత్రకు వచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వందకుపైగా కేసులు వేశారని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలను మనకు రాకుండా అడ్డుకున్న ఆంధ్ర పాలకుతో దోస్తీకట్టి మరోమారు మనకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. జిల్లాలో మొట్ట మొదటగా ఓడిపోయేది జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్రెడ్డేనన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు మళ్లి టీఆర్ఎస్ పార్టీని గెలి పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఉన్నారు. విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలి గుర్రంపోడు : బూత్ కమిటీలు ప్రతి ఓటరును కలిసి టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించి విజయమే లక్ష్యంగా ముందుకుసాగాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. మండలకేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పథకాలను గడపగడపకు ప్రచారం చేసేలా ప్రతి కార్యకర్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా పదవులు అçనుభవించిన జానారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. సమావేశంలో మాజీ ఆప్కాబ్ చైర్మెన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, జెడ్పీటీసీ గాలి రవికుమార్, కంచర్ల విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాజకీయాలకే వన్నెతెచ్చిన అక్కిరాజు వాసుదేవరావు
సాక్షి,కోదాడ అర్బన్ : ఎంతో చైతన్యం కల్గిన హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అక్కిరాజు వాసుదేవారావు నాటి రాజకీయాలకే వన్నె తెచ్చారు. ప్రజలకిచ్చి వాగ్దానాలను నెరవెర్చడంలో ఆయన సఫలీకృతులయ్యారు. 1962 నుం చి1972 మరకు వరకు రెండు సార్లు కాంగ్సెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికై బ్రహ్మానందరెడ్డి, పీవీ నర్సింహా రావుల కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం 1977 కోదాడ నియోజకవర్గం ఏర్పడిన అనంతరం ఆయన 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొంతకాలం తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.1978కు ముందు కాంగ్రెస్ ఉన్న ఆయనను ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి పరిశీలనలో ఉన్నదని, ఆయన సమకాలికులు చెబుతున్నారు. స్వచ్ఛందంగా.. 1983 వరకు కోదాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అదే సంవత్సరంలో స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చినప్పటికీ స్థానిక పరిస్థితలను అవగతం చేసుకుని, పెరిగిన ఎన్నికల వ్యయం, వర్గవిభేదాలు, కులప్రాతిపతికన ఓట్లు చీలడంతో పోటీనుంచి తప్పుకున్నారు. తన శిష్యుడైన చింతాచంద్రారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇప్పించారు. నేటి రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే టికెట్ల కోసం తన్నుకుంటున్న ఈ స్థితిలో ఆయనకు వచ్చిన టికెట్‌ను స్యచ్ఛందంగా వదులుకుని సమకాలిన రాజకీయాలకే వన్నె తెచ్చారు. ఈ నిర్ణయాన్ని కోదాడ ఎన్నికల బహిరంగ సభకు వచ్చిన మాజీ ప్రధాని, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ స్యయంగా బహిరంగ వేదిక పైనుంచే అభినందించారు. విద్యాప్రదాతగా.. హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల్లో పోటీచేసిన సందర్భములో ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు కోదాడలో డిగ్రీ కళాశాలను ఆర్ట్స్అండ్ సైన్స్ విభాగంతో ఏర్పాటు చేయించారు. తొలుత కోదాడ బాలుర ఉన్నతపాఠశాలలో ఈ కళాశాలను ప్రారంభించారు. అనంతరం తన బంధువులైన కొండపల్లి రాఘవమ్మరంగారవు నుంచి 60ఎకరాల భూమిని విరాళంగా సేకరించి 1970లో కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాలకు ఫౌండర్ చైర్మన్‌గా ఆయన కొనసాగారు. అదే విధంగా ఆయన కళాశాల అభివృద్ధికి అన్ని వర్గాలను భాగస్వామ్యం చేశారు. అప్పట్లోనే విదేశాల్లో ఎంబీఏ చదివిన మాజీమంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణరావును కళాశాల కరస్పాండెంట్‌గా చేశారు. ఈ కళాశాల ద్వారా ఎందరో విద్యార్ధులు ఉన్నత చదువులు చదివి, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ కళాశాలకు, కళాశాల విద్యార్థులకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం బ్రహ్మానందరెడ్డితో.. వంద గ్రామాలకు ఒకే సారి విద్యుత్ నియోజకవర్గ పరిధిలో వంద గ్రామాలకు ఒకే సారి విద్యుత్ సౌకర్యం కల్పించిన ఘనత కూడా ఆయనకు ఉన్నదని పలువురు పేర్కొంటున్నారు. అప్పటి వరకు కిరోసిన్ దీపాలతో ఉండే గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి, వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. రహదారులు, వైద్యానికి పెద్దపీట నియోజకవర్గంలో రహదారులను ఏర్పాటు చేయడంలో ఆయన కృషిచేశారు. కనీస రహదారి లేని గ్రామాలకు మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు రహదారి సౌకర్యాలు కల్పించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ ద్వారా హుజూర్నగర్, కోదాడ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అనేక గ్రామాలను కలుపుతూ రోడ్లు వేయించారు. స్వతహాగా ఆర్ఎంపీ వైద్యుడైన ఆయన నియోజకవర్గంలో వైద్యానికి కూడా పెద్దపీట వేశారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో వైద్య సదుపాయాలు కల్పించేందుకు కృషిచేశారు. గఫార్‌ఖాన్ ప్రసంగాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తున్న అక్కిరాజు సాగర్ కాలువల ఏర్పాటులో కూడా ప్రత్యేకతే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆయన హుజూర్నగర్, కోదాడ ప్రాంతాలకు సాగర్‌నీటిని తీసుకొచ్చేందుకు చేసిన కృషి ఇప్పటికీ ఆయా ప్రాంతాల ప్ర జలు కొనియాడుతారు. పీవీ నర్సింహారావు మంత్రి వ ర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆ యన అప్పటి కాలువల ఏర్పాటులో ఎంతో కృషిచేశారు. జాతీయ నాయకులతో సత్సంబంధాలు రాజకీయంగా ఆయన రాష్టంలో మంచి గుర్తింపు తెచ్చుకుని జాతీయ నాయకులతో మంచి సత్సంబంధాలను కొనసాగించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కోదాడకు వచ్చిన సందర్భముగా ఆయనను అభినందించి సెంట్రల్లో మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. అనంతరం ఆమె హత్యకు గురికావడంతో రాజకీయ ప్రస్థానానికి ఇబ్బంది ఏర్పడింది. పీవి నర్సింహారావుకు బంధువు, అత్యంత ఆత్మీయుడు అయన వాసుదేవరావుకు మారుతున్న రాజకీయ పరిణామాలతో రాజకీయ జీవితానికి విఘాతం కల్గింది. ఆప్కాబ్ చైర్మన్, ఖాధీ భాగ్యనగర సమితి చైర్మన్ ఆయన కొనసాగారు. జాతీయ స్థాయిలో ఆయనకు మణిశంకర్ అయ్యర్ తదితర ఆనాటి నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. రాష్ట్రంలో అప్పటి పెద్దతరం నాయకులు, సినిమా పరంగా ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సి నారాయణరెడ్డి, దాశరథిలతో మంచి సంబంధాలను కొనసాగించారు. ఆంగ్లంలో అనర్గళవక్తగా అక్కిరాజు వాసుదేవరావుది హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న మేళ్లచెర్వు శివారు వెంకట్రాపపురం. ఆయన కుటుంబం భూస్వామ్య కుటుంబం కావడంతో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఆయనను ఆయన తల్లిదండ్రులు కృష్ణా జిల్లాలో చదివించారు. అక్కడ ఆయన ఎస్ఎస్ఎల్సీ వరకు చదవి అంగ్లంలో మంచి పట్టు సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాలంలో అసెంబ్లీలో పలు సమస్యలపై ఆంగ్లలో మాట్లాడుతుంటే సభ ఆసాంతం ఆలకించేదని పాత తరం నాయకులు తెలిపే వారు. ఆంగ్లంలో మంచి పట్టు సాధించడంతో జాతీయ స్థాయిలో కూడా ఆయన మంచి గుర్తింపు వచ్చిం ది. రాష్ట్రానికి జాతీయ నాయకులు ఎవరు వచ్చినా వారి ప్రసంగాలను ఆయన తర్జుమా చేసే వారని తెలిపారు. -
కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం
సాక్షి,గుర్రంపోడు : కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని నాగార్జునసాగర్ అసెంబ్లీ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. మంగళవారం మండలంలోని తేనపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, వెంకటాపురం(ఎస్), ఎల్లమోనిగూడెం, తేనపల్లి తండా, తానేదార్పల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని మరోసారి తెలంగాణకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి తగిన బుద్ధి చెబుతారన్నారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన కేసీఆర్‌ను మరోసారి అధికారంలో తీసుకరావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్లో చేరికలు.. రజక సంఘం నాయకుడు పగిళ్ల లాలయ్య , తేçనపల్లి గ్రామానికి చెందిన పలువురు ఇతర పార్టీల నుంచి తరి వెంకటయ్య ఆధ్వర్యంలో 40 మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంసీ కోటీ రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్ నాయక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గుండెబోయిన కిర ణ్‌కుమార్, జిల్లా నాయకులు మంచికంటి వెంకటేశ్వర్లు, పాశం గోపాల్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ నగేష్‌గౌడ్, పూల సత్యనారాయణ, తేలుకుంట్ల కుర్మారెడ్డి, మదార్షా, ఉమర్, షేక్ సయ్యద్‌మియా పాల్గొన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లడిగే అర్హత లేదు: ప్రజలు,కార్యకర్తలతో మాట్లాడుతున్న ఝాన్సీ తిరుమలగిరి : గత 60 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించి అభివృద్ధి చేయని కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదని టీఆర్ఎస్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్ధి నోముల నర్సింహయ్య కుమార్తె, ఎన్ఆర్ఐ నోముల ఝాన్సీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అనంరతం ఝాన్సీ సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో రవి, సైదులు, పార్వతమ్మ, రామాంజి పాల్గొన్నారు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలి.. త్రిపురారం : టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని ఆ పార్టీ రాష్ట్ర మహిళానాయకురాలు వూర గాయత్రియాదవ్ అన్నారు. నోముల నర్సింహయ్య గెలుపు కోసం ఆమె మంగళవారం తిరుమలగిరి మండలంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం హాలియాలోని తన సోదరుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య నివాసంలో తిరుమలగిరి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ రవియాదవ్, వెంకటయ్య, హేమ, రవి, రంగనాయక్, మునినాయక్, చంద్రం, కాంతారావు, నర్సింహ్మరావు, బిచ్చ, చెన్న పలువురు నాయకులు తదితరులు ఉన్నారు. -
అక్కడ ఆయనకు తిరుగులేదు..!
త్రిపురాదం(నాగర్జునసాగర్) : పర్యాటకకేంద్రంగా పేరొందిన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి ఏడు పర్యాయాలు విజయం సాధించిన కుందూరు జానారెడ్డి సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. అదే విధంగా ఎన్టీఆర్ మంత్రి వర్గంలో 1983, 1985లో కుందూరు జానారెడ్డి 13 శాఖల మంత్రిగా రికార్డుకెక్కారు. నిమ్మల రాములు వరుసగా మూడు పర్యాయాలు గెలుపొంది హ్యాట్రిక్ సాధించగా కుందూరు జానారెడ్డి డబుల్ హ్యాట్రిక్ దాటి చరిత్ర సృష్టించారు. 1962లో పెద్దవూర నియోజకవర్గంలో జరిగిన తొలి ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్థిగా పీ.పర్యతరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీఎన్.రెడ్డిపై 2,302 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలి ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత 1967లో చలకుర్తి నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ జరిగిన తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిమ్మల రాములు సీపీఎం నుంచి ఎం. ఆదిరెడ్డిపై 6656 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967 నుంచి 2004 వరకు చలకుర్తి నియోజకవర్గంగా కొనసాగింది. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన అనంతరం చలకుర్తి నియోజకవర్గ స్థానంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పేరుతో 2009లో కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. సాగర్ నియోజకవర్గంలో అనుముల, నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, గుర్రపోడు, తిరుమలగిరి మండలాలు ఉన్నాయి. 1962లో సీపీఐ నుంచి గెలిచిన పీ.పర్వతరెడ్డి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగలేదు. 2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గం ఏర్పాటు 1952 నుంచి జరిగిన మార్పు, చేర్పుల వల్ల 2009లో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏర్పడింది. 1952లో ఈ నియోజకవర్గం కొంత ప్రాంతం పెద్దమునిగల్ నియోజకవర్గంలో ఉంది. 1957లో దేవరకొండ నియోజకవర్గం పరిధిలోకి వచ్చింది. ఆ తరువాత 1962లో పెద్దవూర నియోజకవర్గంగా ఏర్పడింది. 1967లో చలకుర్తి నియోజకవర్గంగా మారింది. తిరిగి 2009లో నాగార్జునసాగర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పటివరకు చలకుర్తిలో ఉన్న దామరచర్ల మండలాన్ని మిర్యాలగూడలోకి కలిపి దేవరకొండలో ఉన్న గుర్రంపోడు మండలాన్ని సాగర్ నియోజకవర్గంలో కలిపారు. సుదీర్ఘకాలం మంత్రిగా జానారెడ్డి రికార్డు నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఏడుసార్లు ప్రాతినిధ్యం వహించిన కుందూరు జానారెడ్డి రాష్ట్ర శాసనసభ చరిత్రలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం 15ఏళ్లకు పైబడి మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. అంతేకాదు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో 13 మంత్రిత్వశాఖలు చేసి జానారెడ్డి రికార్డుకెక్కారు. అదేవిధంగా ఏకంగా ఏడు ఎన్నికల్లో జానారెడ్డి విజయం సాధించి ఎనిమిదో విజయంపై దృష్టి సారించారు. 1978 ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ఆయన జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా 1983, 1988 ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించారు. ఆ తరువాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. అనంతరం 1994 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జానారెడ్డి ఆ తర్వాత వరుసగా 1999, 2004, 2009, 2014 నాలుగు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది పర్యాయాలు ఎన్నికల బరిలో నిలిచిన జానారెడ్డి రెండుసార్లు ఓటమి పాలుకాగా, ఏడు పర్యాయలు విజయం సాధించి 2018 ఎన్నికల్లో ఎనిమిదో విజయం సొంతం చేసుకోవడంపై గురిపెట్టారు. నిమ్మల, జానారెడ్డి మధ్యే ఎక్కువసార్లు పోటీ 1967, 1972, 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు ఇండిపెండెంట్, కాంగ్రెస్ తరుపున పోటీచేసి నిమ్మల రాములు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1967, 1972లో సీపీఎం, ఇండిపెండెంట్ తరపున పోటీ చేసిన ఎం. ఆదిరెడ్డిపై ,1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జానారెడ్డిపై నిమ్మలరాములు వరుసగా మూడు సార్లు గెలుపొందారు. అప్పటి వరకు నిమ్మల రాములు పేరున ఉన్నహ్యాట్రిక్ రికార్డును కుందూరు జానారెడ్డి అధిగమించి డబుల్ హ్యాట్రిక్‌ను దాటిపోయారు. డబుల్ హ్యాట్రిక్ దాటిన జానారెడ్డి రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. 1994 ఎన్నికల్లో జానారెడ్డిపై టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన గుండెబోయిన రాంమ్మూర్తియాదవ్ విజయం సాధించారు. ఈ ఎన్నికలో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో జానారెడ్డి ఏడు పర్యాయాలు విజయం సాధించారు. వ్యవసాయమే ఆధారం నాగార్జునసాగర్ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతంలోని 80శాతం మంది వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నియోజకవర్గంలో అనుముల, నిడమనూరు, త్రిపురారం మండలాల గుండా సాగర్ ఎడమ కాల్వ ప్రవహిస్తుంది. కానీ సగమే ఆయకట్టు కాగా మిగిలిన సగం ఆయకట్టేతర ప్రాంతం. ఆయకట్టు ప్రాంతంలో రైతులు వరిసాగుచేస్తుండగా, ఆయకట్టేతర ప్రాంతంలో మెట్టపంటలను పండిస్తున్నారు. గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో కొంత వరకు ఎస్ఎల్బీసీ ద్వాదా సాగునీరందుతుంది. -
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జానా
కుట్రలు, కుతంత్రాల నడుమ పోలింగ్ 60 ఏళ్ల వారికి బదులుగా 20 ఏళ్లవారితో ఓట్లేయించుకున్న ఘనత ఆయనదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల హాలియా, న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల విషయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మేకపోతుగాంభీర్యం ప్రదర్శిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. గురువారం హాలియాలో ఆ పార్టీ జిల్లా నాయకుడు మల్గిరెడ్డి లింగారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రశాంతంగానే జరిగాయన్నారు. ఫలితాలు మాత్రం టీఆర్ఎస్కు అనుకూలంగా రానున్నట్లు తెలిపారు. వివాదాస్పదమైన గ్రామాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని స్థానిక రిటర్నింగ్ అధికారితో పాటు జిల్లా కలెక్టర్, స్టేట్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అయినా స్థానిక రిటర్నింగ్ అధికారి సరిగా స్పందించలేదని ఆరోపించారు. 60 ఏళ్ల వారి ఓట్లను 20 ఏళ్ల వారితో వేయించుకున్నారన్నారు. రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ఏజెంట్లపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. పేరూరు గ్రామ పోలింగ్ బూత్‌లో కూర్చున్న టీఆర్ఎస్ ఏజెంట్‌ను కొడితే ఆపేందుకు అక్కడికి వెళ్లిన తన కుమారుడిని ఎక్కడోనివిరా అంటూ దుర్భాషలాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. మరి భాస్కర్‌రావు, హనుమంతరావు, నీ కుమారుడు ఎక్కడోళ్లని ఎమ్మెల్యే టికెట్ అడిగారని జానాను ప్రశ్నించారు. ‘మీరు పెద్దరికంతో వ్యవహరిస్తే చేతులెత్తి దండం పెడతా.. లేకుంటే దొండాకు పసరు నుంచి అన్నీ కక్కిస్తా’ అని జానాను హెచ్చరించారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, అంకతి వెంకటరమణ, కృష్ణయ్య, ఎక్కలూరి శ్రీనివాస్‌రెడ్డి, కర్ణ నర్సిరెడ్డి పాల్గొన్నారు.