
నల్లగొండ: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో పూస శ్రీనివాస్ అనే వ్యక్తి అర్ధనగ్నంగా వెళ్లి సాగర్ ఉపఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరఫున నామినేషన్ వేసేందుకు అతను రిక్షాపై అర్ధనగ్నంగా వచ్చి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నాడు. బనియన్, లుంగీతోనే కార్యాలయం లోపలికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా పూస శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యావంతుడినైన తనకు 49 సంవత్సరాల వయసు వచ్చినా ఉద్యోగం లేదన్నారు.
తనలాంటి ఎందరో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి–భువనగిరి జిల్లాకు చెందిన తాను గతంలోనూ ఇదే డిమాండ్‌తో నామినేషన్ వేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment