సాగర్‌లో మాట్లాడుతున్న నర్సింహయ్య
సాక్షి, నాగార్జునసాగర్ : నియోజకవర్గంలో జానారెడ్డి ఆటలు ఇక సాగనీయమని టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. శుక్రవారం పైలాన్ కాలనీలో ర్యాలీ నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానారెడ్డిని గ్రామాలలోకి ప్రచారా నికి వెళితే నీ సేవలు ఇక చాలు గో బ్యాక్ అంటున్నారన్నారు. అయినా గెలుపు తమదేనని బీరాలు పలుకుతున్నాడని ఈసారి ఆ మాయలను సాగనివ్వవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ ప్రజలు తమకే మెజార్టీ ఇచ్చారని ఈసారి సాగర్ నుంచే ఐదు వేల మెజార్టీ ఇవ్వాలని కాలనీల వాసులను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చలవతో సాగర్‌ను నంది కొండ పేరుతో మున్సిపాలిటీ చేశామని తమను గెలిపిస్తే ఈ మున్సిపాలిటీకి బొడ్రాయిగా ఉండి మీకు సేవచేస్తానని అన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ అభివృద్ధికిగాను రూ.20 కోట్లు మంజూరయ్యాయని కాలనీలలో అంతర్గత రోడ్లు, డ్రెనేజీ లు, నిత్యం తాగునీటి వసతి కల్పించేందుకు నిధులు ఖర్చు చేయవచ్చన్నారు. కాలనీలలోని ఎన్‌ఎస్‌పీ క్వార్టర్లను నామినల్ రేటుతో రెగ్యులర్ చేయించే బాధ్యత తమదేనన్నారు. ముస్లింలకు గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతులు ఇప్పించే బాధ్యత తమదేనన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిక..
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మైనార్టీ నాయకులు గౌస్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్న బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నోముల నర్సింహయ్య సమక్షంలో పార్టీలో చేరారు. తిరుమలగిరి మండలం రంగుండ్లకు చెందిన 100 మంది కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో బత్తుల సత్యనారాయణ, రామకృష్ణ, శేఖరాచారి, మసీదు రాము తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడు : తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని మొసంగి, తెరాటిగూడెం, ఎరడ్లగూడెం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించి మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయాలని అన్నారు. తెలంగాణాపై ఆధిపత్యం కొనసాగించేందుకు ఆంధ్రా పాలకులు ప్రయత్నిస్తున్నారని, ఓటుతో వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే అవకాశం తనకు ఇవ్వాలని అన్నారు. దశాబ్దాలుగా పదవులు అనుభవిస్తున్న వారు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గాలి రవికుమార్, ఎంపీటీసీల ఫోరం నియోజకవర్గ కార్యదర్శి పాశం గోపాల్‌రెడ్డి, నాయకులు జలగం సుదర్శన్‌రావు, మండల అధ్యక్షుడు గుండెబోయిన కిరణ్‌కుమార్ యాదవ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బల్గూరి నగేష్‌గౌడ్, గజ్జెల చెన్నారెడ్డి, పొనుగోటి నర్సింహారావు, గోలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment