సాక్షి,గుర్రంపోడు : కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని నాగార్జునసాగర్ అసెంబ్లీ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. మంగళవారం మండలంలోని తేనపల్లి, పోచంపల్లి, ఉట్లపల్లి, వెంకటాపురం(ఎస్), ఎల్లమోనిగూడెం, తేనపల్లి తండా, తానేదార్‌పల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని మరోసారి తెలంగాణకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి తగిన బుద్ధి చెబుతారన్నారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన కేసీఆర్‌ను మరోసారి అధికారంలో తీసుకరావడం ఖాయమన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరికలు..
రజక సంఘం నాయకుడు పగిళ్ల లాలయ్య , తేçనపల్లి గ్రామానికి చెందిన పలువురు ఇతర పార్టీల నుంచి తరి వెంకటయ్య ఆధ్వర్యంలో 40 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంసీ కోటీ రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్ నాయక్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు గుండెబోయిన కిర ణ్‌కుమార్, జిల్లా నాయకులు మంచికంటి వెంకటేశ్వర్లు, పాశం గోపాల్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ నగేష్‌గౌడ్, పూల సత్యనారాయణ, తేలుకుంట్ల కుర్మారెడ్డి, మదార్‌షా, ఉమర్, షేక్ సయ్యద్‌మియా పాల్గొన్నారు.
కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లడిగే అర్హత లేదు:
ప్రజలు,కార్యకర్తలతో మాట్లాడుతున్న ఝాన్సీ
తిరుమలగిరి : గత 60 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించి అభివృద్ధి చేయని కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదని టీఆర్‌ఎస్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్ధి నోముల నర్సింహయ్య కుమార్తె, ఎన్‌ఆర్‌ఐ నోముల ఝాన్సీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అనంరతం ఝాన్సీ సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో రవి, సైదులు, పార్వతమ్మ, రామాంజి పాల్గొన్నారు.
అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలి..
త్రిపురారం : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని ఆ పార్టీ రాష్ట్ర మహిళానాయకురాలు వూర గాయత్రియాదవ్ అన్నారు. నోముల నర్సింహయ్య గెలుపు కోసం ఆమె మంగళవారం తిరుమలగిరి మండలంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం హాలియాలోని తన సోదరుడు టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య నివాసంలో తిరుమలగిరి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ రవియాదవ్, వెంకటయ్య, హేమ, రవి, రంగనాయక్, మునినాయక్, చంద్రం, కాంతారావు, నర్సింహ్మరావు, బిచ్చ, చెన్న పలువురు నాయకులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment