నల్గొండ: నల్గొండ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో ఆరుగురికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పట్టణ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా పరిమితికి మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 21మంది పట్టుబడ్డారు. వీరందరినీ బుధవారం కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఆరుగురికి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్పెషల్ కోర్టు వారం రోజులు జైలు శిక్ష విధించింది. దీంతో వారిని పోలీసులు జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment