
సాక్షి, హైదరాబాద్ : హీరో, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్‌పై జూనియర్ ఆర్టిస్ట్ దివ్య ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ తనతో పాటు చాలా మంది అమ్మాయిలను మోసం చేస్తూ శారీరకంగా వాడుకుంటున్నారని.. ఆయనను లారెన్స్ సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సహాయం కోసం వెళ్లే అప్పటి వెస్ట్ మారేడ్‌పల్లి సీఐ.. ప్రస్తుత ఏసీపీ రవీందర్‌రెడ్డి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమను తిరస్కరించింనందుకు వినోద్ గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని ఆరోపించారు. తన ఫోన్ నెంబర్ తీసుకొని వినోద్ ప్రపోజ్ చేశాడని.. తిరస్కరించడంతో చంపుతానని బెదిరిస్తున్నారని చెప్పారు. తన స్నేహితులను సైతం ట్రాప్ చేసి వారితో వినోద్ అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు.
‘వినోద్ వేధింపులను తట్టుకోలేక మొదటగా ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే అక్కడ ఎఫ్‌ఐఆర్ బుక్ చేయకుండా ఓ కానిస్టేబుల్‌తో మళ్లీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని వినోద్ చెప్పించాడు. దీంతో కేసు పెట్టకుండా వెళ్లిపోయాను. మళ్లీ కొద్దిరోజుల తర్వాత తిరిగి వేధించడం మొదలు పెట్టాడు. ఆయన వేధింపులు భరించలేక వెస్ట్ మారెడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పటి వెస్ట్ మారెడ్‌పల్లి సీఐ రవీందర్‌రెడ్డి తాను చెప్పినట్లు వింటే న్యాయం చేస్తానని అన్నారు. కేసు గురించి మాట్లాడేందుకు ఓ లాడ్జికి రమ్మని అక్కడ నాతో అసభ్యంగా మాట్లాడారు. కులం పేరుతో దూషించారు. నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. 2006 నుంచి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని దివ్య వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఎన్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు విజ్ఙప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment