Errolla Srinivas
-
వాళ్లను రాళ్లతో కొట్టినా పాపం లేదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో రాజకీయ అవకాశాలు పొంది, పదవులు అనుభ వించి పార్టీలు మారుతున్న నేతలను రాళ్లతో కొట్టినా త ప్పులేదని బీఆర్ఎస్ నాయ కులు ఎర్రోల్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు కొందరు రాజకీయ విలువలు లేని పవర్ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలతో కలిసి శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో అవకాశాలు లేక రాజకీయంగా వెంటిలేటర్‌పై ఉన్న నేతలకు కేసీఆర్ పదవులతో సంజీవని ఇచ్చి బతికించారు. ఎంతో మంది నేతలున్నా కడియం శ్రీహరికి కేసీఆర్ వరుస అవకాశాలు కల్పించారు. కడియం కారణంగానే తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, పసునూరి దయాకర్ పార్టీకి దూరమయ్యారు. ఉద్యమంలో మేము త్యాగాలు చేస్తే కడియం లాంటి వాళ్లు భోగం అనుభవించారు. బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన పదవులకు పార్టీ నుంచి బయటకు వెళ్లే వారు రాజీనామా చేయాలని, లేని పక్షంలో గతంలో రేవంత్‌రెడ్డి చెప్పినట్లు వారి ఇళ్ల ముందు చావు డప్పు కొట్టి, రాళ్లతో కొట్టాలి. కడియం లాంటి నేతల పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండకపోతే మా తరహాలోనే నష్టపోతారు. కేసీఆర్‌ను తప్పు పట్టే అర్హత కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు లేదు. చంద్రబాబు డైరెక్షన్లోనే కొందరు నేతలు కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కేకే, కడియంకు బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందో చెప్పాలి’అని ఎర్రోల్ల శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు అవకాశం ఇస్తే వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
లారెన్స్‌పై జూనియర్ ఆర్టిస్ట్ దివ్య ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : హీరో, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్‌పై జూనియర్ ఆర్టిస్ట్ దివ్య ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ తనతో పాటు చాలా మంది అమ్మాయిలను మోసం చేస్తూ శారీరకంగా వాడుకుంటున్నారని.. ఆయనను లారెన్స్ సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సహాయం కోసం వెళ్లే అప్పటి వెస్ట్ మారేడ్‌పల్లి సీఐ.. ప్రస్తుత ఏసీపీ రవీందర్‌రెడ్డి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమను తిరస్కరించింనందుకు వినోద్ గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని ఆరోపించారు. తన ఫోన్ నెంబర్ తీసుకొని వినోద్ ప్రపోజ్ చేశాడని.. తిరస్కరించడంతో చంపుతానని బెదిరిస్తున్నారని చెప్పారు. తన స్నేహితులను సైతం ట్రాప్ చేసి వారితో వినోద్ అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ‘వినోద్ వేధింపులను తట్టుకోలేక మొదటగా ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా ఓ కానిస్టేబుల్‌తో మళ్లీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని వినోద్ చెప్పించాడు. దీంతో కేసు పెట్టకుండా వెళ్లిపోయాను. మళ్లీ కొద్దిరోజుల తర్వాత తిరిగి వేధించడం మొదలు పెట్టాడు. ఆయన వేధింపులు భరించలేక వెస్ట్ మారెడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పటి వెస్ట్ మారెడ్‌పల్లి సీఐ రవీందర్‌రెడ్డి తాను చెప్పినట్లు వింటే న్యాయం చేస్తానని అన్నారు. కేసు గురించి మాట్లాడేందుకు ఓ లాడ్జికి రమ్మని అక్కడ నాతో అసభ్యంగా మాట్లాడారు. కులం పేరుతో దూషించారు. నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. 2006 నుంచి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని దివ్య వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఎన్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు విజ్ఙప్తి చేశారు. -
కేసులపై ఇంత నిర్లక్ష్యమా..?!
సాక్షి, మంచిర్యాల: ‘కమిషన్ సమీక్ష సమావేశం అంటే కాగితాలు ఇస్తే సరిపోతుంది.. కేసుల వివరాలు వివరించాల్సి అవసరం లేదనుకున్నారా..? రాష్ట్రంలోని 28 జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు మంచిర్యాలలో పెండింగ్ ఉన్నాయి. ఎందుకింత నిర్లక్ష్యం..’ అంటూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ పోలీస్, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మంచి ర్యాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ భారతి హోళీకేరి, జేసీ వై.సురేందర్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, ఎస్సీ కమిషన్ సభ్యులు నీలాదేవి, డీసీపీ రక్షిత కే.మూర్తితో కలిసి ఎస్సీ, ఎస్టీ విచారణ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బాధితులకు 20శాతం కేసులు కూడా పూర్తి చేయలేదని, వారికి ఎలాంటి న్యాయమూ చేయడం లేదని పేర్కొన్నారు. ‘జిల్లా నుంచి 81 ఎస్సీ, ఎస్టీ కేసులు నా వద్దకు వచ్చాయి. వీటిపై విచారణ ఎంత వరకు వచ్చిందని అడిగితే సమా«ధానం లేదు. ప్రభుత్వం బాధితులకు ఎక్స్‌గ్రేషియానే ఇస్తుంది. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్, రెవెన్యూ అధికారులపైనే ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలసాకుతో నిందితులను అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు..’ అంటూ ప్రశ్నించారు. నెలల తరబడి ‘బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. వారి బాధలు మీకు పట్టవా.. ఇలాగైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పేద బాధితులు పోలీసులపై ప్రభుత్వంపై నమ్మకం పోతుంది..’ అన్నారు. ‘నేను పిహెచ్డీ చేశాను. ఉద్యమంలో పాల్గొన్నాను. ప్రతి గ్రామం, గూడెం, తండాలను సందర్శించాను. ఎస్సీ, ఎస్టీలకు జరిగే అన్యాయాలను ప్రత్యేకంగా చాశా. బాధితులకు పోలీస్, రెవెన్యూ అధికారులు అండగా ఉండాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో కమిషన్ అంటే కార్యాలయానికే పరిమితం అయ్యింది. రాష్ట్రం వచ్చిన తర్వాత నేను కమిషన్ అయినప్పటి నుంచి ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. ప్రతి పోలీస్టేషన్లో, ఇతర కార్యాలయాల్లో కేసులను బట్టి ఎక్స్‌గ్రేషియా వివరాలు, శిక్షలు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్స్‌గ్రేషియా కాదు.. శిక్ష పడాలి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కేసులకు సంబంధించి 5 వేల మంది బాధితులకు రూ.41.33 కోట్ల ఎక్స్‌గ్రేషియా అందించిందన్నారు. ప్రభుత్వం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తుంది కాని నిందితులకు శిక్షపడేలా చేయాల్సింది పోలీస్ అధికారులదే బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం దళితుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బాధితుల సమస్యలు తెలసుకుని పరిష్కరించేందుకు కలెక్టర్ల అధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. 2018 జనవరి 18న బాధితుల సరైన న్యాయం అందించేందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియమించిందని, బాధితుల పట్ల పూర్తి భరోసా ఇచ్చి మనోధైర్యం నింపి అండగా నిలుస్తుందన్నారు. అట్రాసిటి కేసులు, భూ వివాదాలు తదితర అంశాలపై పోలీసు అధికారులు కేసుల వివరాలు నమోదు చేసి కలెక్టర్ సమక్షంలో జరిగే సమావేశంలో చర్చించాలని, బాధితులకు తగిన న్యాయం జరిగేలా కమిషన్ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే 28 జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా బాధితుల సమస్యలను తెలసుకుని వాటి పరిష్కరానికి కృషి చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో పనిచేస్తూ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు సామాజిక భద్రత కల్పించేలా చొరవ తీసుకోవాలని తెలిపారు. కేసులపై ఇప్పటివరకు రిమైండర్లు పంపించామని, మూడు రిమైండర్లు జారీ చేసిన తరువాత విచారణ చేసి శిక్షించే అధికారం కమిషన్‌కు ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మరోసారి నిర్వహించే సమీక్ష సమావేశం నాటికి ప్రతి కేసు వివరంగా, క్షుణ్ణంగా ఉండాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. పలు మండలాల నుంచి వచ్చిన బాధితులు రోదిస్తూ.. ఫిర్యాదులు అందించారు. కార్యక్రమంలో డీఆర్వో రాజేశ్వర్, ఏసీపీలు గౌస్‌బాబ, బాలు జాదవ్, వెంకటరెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ కో–ర్డినేటర్ అత్తిసరోజ, ఆర్డీవో సురేష్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జిల్లా అధ్యక్షులు జిల్లపెల్లి వెంకటస్వామి పాల్గొన్నారు. మంచిర్యాల అంటే నమ్మకం రాష్ట్రంలో అన్ని జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహించాం. కేసులు పెండింగ్ ఈ జిల్లాలో ఉన్నట్లు ఎక్కడా లేవు. మంచిర్యాల అంటే ఎంతో మంచి జిల్లాగా గుర్తించాను. ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసిన వారిపై తక్షణమే స్పందించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. పెండింగ్ కేసులు ఉండకుండా అ«ధికారులు చర్యలు తీసుకోవాలి. – లీలాదేవి, ఉమ్మడి జిల్లా ఎస్సీ,ఎస్టీ కమిషన్ మెంబర్ సాక్ష్యులకు రవాణా ఖర్చులు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో సాక్ష్యులను తీసుకొచ్చే వారికి ప్రభుత్వం రవాణా, భోజన చార్జీలు చెల్లించాలి. పేద ఎస్సీ, ఎస్టీ బాధితులు సాక్ష్యులను నిందితులు మచ్చిగా చేసుకుని వారే రవాణాచార్జీలు, ఇతర ఖర్చులు చెల్లిస్తుండడంతో కేసు నమోదు సమయంలో ఒక రకంగా.. కోర్టులో మరోరకంగా సాక్ష్యం చెబుతున్నారు. ప్రభుత్వమే ఖర్చులు చెల్లిస్తే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. – రమణారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ, పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ -
ఎరుకల స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తా
హైదరాబాద్: కోయలు, గోండులు, చెంచులు, ఎరుకల, పెంట కులస్తుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికనిస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో పందుల పెంపకానికి ఎరుకల కులస్తులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం(టీపీవైఎస్) ఆధ్వర్యంలో 35మంది ఎరుకల కులస్తులకు ఏకలవ్య అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుకల కులస్తుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, కమిషన్‌లో 27,033 కేసులు పెండింగ్‌లో ఉండగా వాటిలో 26వేల కేసులను పరిష్కరించామన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, నాయకులు వి.రమణ, రమేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రత్యేక కోర్టులకోసం సీఎంతో మాట్లాడతా’
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడుల్లో సత్వర న్యాయం కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు. తన ఆఫీస్ నుంచి లేఖలు రాసినా కేసులను ముందుకు తీసుకెళ్లలేదన్నారు.ఎస్సీ, ఎస్టీ కమిషన్ గత 10 సంవత్సరాలుగా చేయని ఎన్నో పనులు ఈ మూడు నెలలుగా తాము చేస్తున్నామన్నారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టాల బాధ్యత కమిషన్‌దే
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం రూపొందించిన చట్టాలను అమలు చేయడంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాత్ర కీలకమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరునూ అధ్యయనం చేయాలని, ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన ఎర్రోళ్ల శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను శ్రీనివాస్ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ అవకాశం టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు అవకాశం వస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ శ్రీనివాస్‌కు సీఎం కేసీఆర్ ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను కమిషన్ అరికట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే కమిషన్ సహించదని, ఫోన్లో లేదా ఎస్సెమ్మెస్ పెట్టినా కమిషన్ స్పందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నియమించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం సంతకం చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్‌కు చెందిన యువ నాయకుడు. కమిషన్ సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ (రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య (హైదరాబాద్‌లోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల)ను నియమించారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. -
'దళితులపై దాడులు జరిపేందుకే...'
-
జనసేన కాదు బాబు సేన-ఎర్రొళ్ల శ్రీనివాస్