కోల్‌కతా: కోల్‌కతాలోని బుర్రాబజార్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. తండ్రితో ఉన్న గొడవలను మనుసులో ఉంచుకొని వారి పిల్లలను నాలుగంతస్థుల భవనంపై నుంచి తోసేశాడో వ్యక్తి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ కమిషనర్ మురళీధర్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం... బుర్రాబజార్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తికి ఇంటి పక్కన ఉన్న మరో కుటుంబంతో వివాదాలు ఉండేవి.
ఈ నేపథ్యంలో సదురు కుటుంబం మీద పగ పెంచుకున్న ఆ వ్యక్తి ఇద్దరి పిల్లలను ఫ్లాట్‌లోని నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. రెండేళ్ల బాలుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో బాలుడు(6) పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఇద్దరు బాలురకు సంబంధించిన సంబంధం తెలియాల్సి ఉంది. కాగా.. ఘటనకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు జేసీపీ శర్మ తెలిపారు. చదవండి: తీవ్ర ఉత్కంఠ, ప్రాణాలకు తెగించి మరీ.!
Comments
Please login to add a commentAdd a comment