ప్రేయసిని తగులబెట్టిన ప్రియుడు.. | Love Couple Burns To Death In Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

ప్రేయసిని తగులబెట్టిన ప్రియుడు..

Mar 18 2019 10:22 AM | Updated on Mar 18 2019 10:26 AM

Love Couple Burns To Death In Bhadradri Kothagudem - Sakshi

కాలిబూడిదైన ఇళ్లు, (ఇన్‌సెట్‌)లో వినోద్‌

ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన వినోద్‌ తేజస్వినిని...

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రాణంగా ప్రేమించిన ప్రియుడే యువతి పాలిట కాలయమడై ఆమెను అగ్నికి ఆహుతి చేశాడు. అనంతరం తాను కూడా అదే మంటల్లో కాలి బూడిదయ్యాడు. ఈ సంఘటన ఆదివారం చుంచుపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో వినోద్‌(25)తేజస్విని(18) అనే ఇద్దరు ప్రేమికులు ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని గత కొద్దికాలంగా సహాజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి.

ఆదివారం రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన వినోద్‌ తేజస్వినిని కిరోసిన్‌ పోసి తగులబెట్టాడు. అనంతరం తాను కూడా తగులబెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసి మృతుల కుటుంబసభ్యుల సైతం అక్కడికి చేరుకుంటున్నారు.

1
1/1

సంఘటనా స్థలం వద్ద గుమికూడిన జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement