లక్కీ లాటరీ పేర రూ.5 లక్షలకు టోకరా | lucky lottery scam | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 9 2017 9:07 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

lucky lottery scam

వేములవాడ: లక్కీ లాటరీ తగిలిందంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌కు మోసపోయాడో వ్యక్తి. ఆ అగంతకులు చెప్పిన ప్రకారం కొంత డబ్బు బ్యాంకులో డిపాజిట్‌ చేసి మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాకలో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లక్నో నుంచి లక్కీ లాటరీ తగిలిందంటూ మారుపాకకు చెందిన అంజయ్యకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది నిజమేనని నమ్మిన ఆయన ఫోన్‌ చేసిన వ్యక్తులు తెలిపినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలోని ఓ బ్యాంకు అకౌంట్‌లో రూ.5 లక్షలను జమ చేశాడు. ఎంతకీ లాటరీ డబ్బు రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న అంజయ్య శనివారం వేములవాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement