
పట్టుబడిన నిందితుడు, గంజాయితో సీఐ వెంకునాయుడు, తహసీల్దార్ రామారావు
విశాఖపట్నం, పెందుర్తి: ఏజెన్సీ నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయి ఆటోను టాస్క్‌ఫోర్స్, పెందుర్తి పోలీసులు సోమవారం రాత్రి పట్టుకున్నారు. పాడేరు మండలం సుడ్రిపట్టు గ్రామానికి చెందిన జె.బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ఆటోలో 70 కిలోల గంజాయిని నగరానికి తరలిస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వేపగుంట వద్ద మాటు వేశారు. ఆటోను పరిశీలించగా అందులోని గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయి సహా మంగళవారం తహసీల్దార్ జె.రామారావు వద్ద హాజరుపరిచారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకునాయుడు వెల్లడించారు. ఎస్‌ఐ శ్యామల, వీఆర్వోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment