వాణి మృతదేహం
నెల్లూరు (క్రైమ్): క్షణికావేశంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఇస్కాన్ సిటీ సమీపంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. కోవూరు చల్లాయపాళెంకు చెందిన నాగరాజు, వాణి (22) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాగరాజు మార్బుల్ పాలిష్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొంతకాలంగా వీరు ఇస్కాన్ సిటీ సమీపంలో నివాసం ఉంటున్నారు. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వస్త్రాలు పెట్టాలని, అందుకు డబ్బులు ఇవ్వాలని శనివారం వాణి తన భర్తను కోరింది. ఈ విషయమై దంపంతుల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది. నాగరాజు ఆమెను మందలించాడు.
దీంతో మనస్థాపం చెందిన వాణి తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జరిగిన విషయాన్ని దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పూర్ణచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment