
మృతి చెందిన కోట్ల లక్ష్మి
విజయనగరం, గజపతినగరం రూరల్: మండలంలోని లోగిశ గ్రామానికి చెందిన కోట్ల లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు శుక్రవారం పాల్ప డింది. వివరాల్లోకి వెళ్తే...కోట్ల లక్ష్మి భర్త సంతోష్‌తో కొద్ది రోజులుగా గజపతినగరం పట్టణంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గతంలో వీరిద్దరూ ప్రేమించి రెండున్నర నెలల కిందటే రామతీర్థంలో పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీకి గతంలో వివాహమై విడాకులు కావడంతో సంతోష్‌కు మేనమామ కుమార్తె కావడంతో ప్రేమబంధం ఏర్పడింది. వివా హానంతరం ఇద్దరి మధ్య తగాదాలు చోటు చేసుకునేవని స్థానికులు తెలిపారు. గురువారం కూడా ఇద్దరి మధ్య వివాదం నెలకొందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సంతోష్ బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు వేసి ఉండడంతో పోలీసులు, స్థానికుల సమక్షంలో తలుపును తెరిచారు. లక్ష్మి పురుగుల మందు తాగినట్టు గుర్తించారు. వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ జె.తారకేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment