![Mental illness Women Commits Suicide in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/7/suicide.jpg.webp?itok=tOP6edJt)
సంగీత మల్హోటియా మృతదేహం
బంజారాహిల్స్: మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోల్‌కతకు చెందిన సంగీత మల్హోటియా(48) కుటుంబంతో సహా బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని హ్యాంగింగ్ గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. గత కొంతకాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ నేపథ్యంలో భర్తతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం భర్తతో గొడవ జరగడంతో సోదరుడు సజ్జన్ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం ఆస్పత్రికి వెళ్లిన ఆమె బంజారాహిల్స్ రోడ్ నెంబర్–9 మీదుగా నడిచి వస్తూ దారిలో ఉన్న హార్మనీ బంజారా అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లింది. అక్కడ వాచ్‌మెన్ లేకపోవడంతో నేరుగా పైకి వెళ్లిన ఆమె కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ‘తన చావుకు ఎవరూ కారణం కాదని, డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ సూసైడ్ నోట్‌లో పేర్కొంది.స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment