మందస (శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలంలో మంగళవారం వలస కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా పడి 36 మంది గాయపడ్డారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి..
► పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు బెంగళూరులో పనిచేస్తున్నారు.
► వీరు పశ్చిమ బెంగాల్‌కే చెందిన స్నేహలత ట్రావెల్స్ బస్సులో సోమవారం స్వస్థలాలకు పయనమయ్యారు.
► శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామ సమీపానికి వచ్చేసరికి డ్రైవర్ ఆశిష్‌కుమార్ నిద్రమత్తులో ఉండడంతో స్టీరింగ్‌పై అదుపు తప్పి బస్సు జాతీయ రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి పల్టీ కొట్టింది.
► బస్సులో మొత్తం 43 మంది ఉండగా, వీరిలో డ్రైవర్, క్లీనర్‌తో పాటు 34 మంది వలస కూలీలు గాయపడ్డారు.
► స్థానికులు ప్రమాదాన్ని గమనించి వెంటనే అక్కడకు చేరుకున్నారు. బస్సు అద్దాలు బద్దలుకొట్టి కూలీలను బయటకు తీశారు.
► మందస పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని అందుబాటులో ఉన్న అన్ని అంబులెన్సులకు సమాచారం అందించారు.
► గాయపడిన వారిని పలాస, హరిపురం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
► మిగిలిన వారిని స్థానిక గిరిజన యూత్ శిక్షణ కేంద్రానికి తరలించి, భోజనం, వసతి ఏర్పాటు చేశారు.
వలస కూలీల బస్సు బోల్తా..
Published Wed, May 27 2020 4:40 AM | Last Updated on Wed, May 27 2020 8:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment