
సాక్షి, ముంబై : ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ప్రచారం మాటమేగానీ.. దానిని నిరూపించేందుకు ఆ శాఖ చెయ్యని ప్రయత్నాలు లేవు. సోషల్ మీడియా వేదికగా వాళ్లు చేసే యత్నాలను స్టంట్లుగా అభివర్ణించేవారు కొందరైతే.. అభినందించేవారు లేకపోలేదు. తాజాగా ముంబై పోలీసులు చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనిశ్ అనే ఓ వ్యక్తి ఓ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు శనివారం, సకినక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఫిర్యాదు చేసే సమయంలో తన పూర్తి వివరాలను అందించగా.. అందులో అతని పుట్టిన అదే రోజని రాశాడు. ఇది గమనించిన రైటర్ ఆ సమాచారాన్ని ఉన్నతాధికారికి అందజేశాడు. అంతే ఆ కేసు ప్రాథమిక విచారణ నివేదిక(ఎఫ్‌ఐఆర్)ను ఓవైపు సిద్ధం చేసి.. కేక్‌తోపాటు ఆ కాపీని అతని చేతిలో పెట్టారు.
ఊహించని ఆ పరిణామానికి అనీశ్ ఉబ్బి తబ్బిబి అయ్యాడు. ఆ యువకుడికి కేక్ తినిపిస్తున్న ఫోటోలను ముంబై పోలీస్ శాఖ తమ అఫీషియల్ ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. పోలీసులది వెన్నెలాంటి మనసు అని పలువురు కామెంట్లు పెడుతున్నారు.
When personal details in the FIR revealed it's complainant Anish's birthday, a Cake followed the FIR Copy at Sakinaka Pstn 😊 pic.twitter.com/tEBnNYdJ3y
— Mumbai Police (@MumbaiPolice) October 14, 2017
Comments
Please login to add a commentAdd a comment