
కావలిఅర్బన్: తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలంటూ నవదంపతులు గురువారం రాత్రి ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దంపతులు కట్టా పవన్‌కుమార్, ఎం.మనీషాలు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వీరు నెల్లూరులో మూడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించారు. అయితే కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో రెండురోజుల క్రితం ముసునూరులోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment