
సాక్షి, మేడ్చల్ : ఇటీవలే వివాహం చేసుకున్న నూతన వధూవరులు ఆత్మహత్యకు పాల్పడడంతో ఓల్డ్ అల్వాల్‌లోని చిన్నన్నతోటలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన మున్నా మల్లేష్ (26) దంపతులు ప్రేమించుకుని 10 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్నోజి గూడ వద్ద గల రాజీవ్ గృహకల్పలోని బ్లాక్ నెంబర్ 78లో నివాసముంటున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం రాజీవ్ గృహకల్పలో నివాసముండేందుకు ఇటీవల వచ్చివెళ్లారని, మూడు రోజుల క్రితం వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment