
నల్లగొండ: క్షణికావేశంలోనే ఎమ్మెల్యే కోమటి రెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందని ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. మిర్చిబండి వద్ద చోటుచేసుకున్న చిన్న గొడవే హత్యకు దారితీసిందన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదనిస్పష్టం చేశా రు. ఆదివారం ఆయన వివరాలను మీడియా కు వివరించారు. మొత్తం 11 మంది నింది తులపై కేసు నమోదు చేశామని, వీరిలో ఎనిమిది మందిని అరెస్టు చేయగా మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు.
ఈ నెల 24న రాత్రి ఆల్ఫా జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న యాదయ్య మిర్చి బండి వద్ద చింత కుంట్ల రాంబాబు, శరత్ మిర్చీలు తీసుకున్నారు. ఉల్లిగడ్డ ఎక్కువ ఇవ్వక పోవడంతో యాదయ్యతో గొడవపడ్డారు. అనంతరం మహేశ్ ఇంటికెళ్లగా కొద్దిసేపటికి మల్లేశ్ అక్కడికి వచ్చాడు. రాత్రి 10 గంటలకు మెరుగు గోపి, రాంబాబు ఫోన్ చేసి మిర్చి బండి వద్దకు రమ్మని చెప్పగా శరత్‌తో కలసి రాంబాబు అక్కడికి వెళ్లాడు. అక్కడ గోపి, రాంబాబుకు మధ్య గొడవ జరిగింది. గోపిపై రాంబాబు చేయి చేసుకున్నాడు. దీనిపై గోపి ఫోన్ చేసి శ్రీనివాస్‌కు వివరిం చాడు.
శ్రీనివాస్ వచ్చి రాజీ కుదుర్చుకునే క్రమంలో మాటామాటా పెరిగి ఒకరికొకరు చేయిచేసుకున్నారు. ఈ ఘర్షణలో రాంబాబు, మల్లేశ్ బండరాయితో మోదడంతో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పో యాడని ఎస్పీ వివరించా రు. కేసులో రాంబాబు, మాండ్ర మల్లేశ్, అల్వాల శరత్‌రాజ్, దుర్గయ్య, కత్తుల కల్యాణ్ సామ్రాట్ అలియాస్ చక్రి, దామునూరి సతీష్, మాండ్ర మహేశ్, మిట్టపల్లి సాయి, మెరుగు గోపి, మాతంగి మోహన్, ప్రసాద్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రసాద్, మిట్టపల్లి సాయి, మాండ్ర మహేశ్ పరారీలో ఉన్నారని చెప్పారు.
‘తప్పుదోవ పట్టించేందుకు కుట్ర’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/నల్లగొండ టౌన్: మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్సీ కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం వేర్వేరుగా శ్రీని వాస్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో ఎస్పీ మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం మిర్చిబండి దగ్గర జరిగిన చిన్న గొడవే శ్రీనివాస్ హత్యకు దారి తీసిందని పేర్కొనడం సమంజసం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment