
సాక్షి, కృష్ణాజిల్లా : నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం చోటుచేసుకుంది. ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన అనురాధ కొన్ని రోజుల నుంచి చెవికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఈ మధ్యే సర్జరీ చేయించుకుంది. అప్పటినుంచి తరచూ అనారోగ్యానికి గురవడంతోపాటు మనస్తాపానికి గురైన విద్యార్థిని డాక్టర్లు ఇచ్చిన మందులను ఎక్కువ మోతాదులో తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
కాగా పరిస్థితిని గమనించిన తోటి విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్సులో నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ట్రిపుల్ ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళా ఎస్సై దేవకీ దేవి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం సత్తెనపల్లిలో ఉంటున్న అనురాధ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment