
గాయాలతో రోడ్డుపై పడిపోయిన మంగేశ్వరి
తాడేపల్లిరూరల్, మంగళగిరిరూరల్: రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో రోజురోజుకు టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఓ వృద్ధురాలి స్థలంపై కన్నేసిన టీడీపీ నేత ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. నిర్మిస్తున్న ఇంటిని కూలదోయించి.. వృద్ధురాలు, ఆమె కుమార్తె దాడి చేయించాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణంలో నివసించే కుంచాల మంగేశ్వరికి తన పూర్వీకుల నుంచి సర్వే నంబర్‌లో 142లో కొంత భూమి వచ్చింది. ఆ భూమి వెనుక మంగళగిరి పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు పోతినేని స్థలం ఉండటం, మంగేశ్వరి స్థలం కూడా కావాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో గొడవ ప్రారంభమైంది. మంగేశ్వరి స్థలం అమ్మడానికి ఇష్టపడకపోవడంతో రాజకీయంగా తన పలుకుబడి ఉపయోగించి నకిలీ పాస్ పుస్తకాలు పుట్టించారు.
దీంతో ఆమె కోర్టుకెళ్లింది. కోర్టు మంగేశ్వరికి అనుకూలంగా తీర్పునివ్వడంతో గురువారం ఇంటి నిర్మాణం చేపట్టింది. దీంతో 50 మంది పోతినేని శ్రీను అనుచరులు వచ్చి ఇంటి నిర్మాణాలను పడగొట్టారు. వృద్ధురాలు, ఆమె కూతురు శివపార్వతిపై దాడి చేశారు. చివరకు కొనుగోలు చేసిన ఇంటి సామానును ఏపీ 07 టీహెచ్ 4788 ట్రాక్టరులో తీసుకెళ్లారు. జరిగిన సంఘటనపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రెండు గంటల తర్వాత తీరిగ్గా వచ్చారు. తనకు, తన కూతురికి పోతినేని శ్రీను నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నట్లు మంగేశ్వరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment