
సాక్షి, వనపర్తి : వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తుముకుంటలో గురువారం కరెంట్‌షాక్‌తో రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతిని బంధువుల ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. కరెంట్ తీగలు రాజును బలితీసుకున్నాయంటూ వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.