
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన ప్రేమను నిరాకరించిందని తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. ఈ సంఘటన ఏలూరు పాత బస్టాండ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన విజయ్ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమ పేరుతో వేదింపులకు గురిచేస్తున్నాడు.
బాలిక అతని ప్రేమను తిరస్కరించడంతో స్నేహితులతో కలిసి ఆమె పై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థిని చేతికి, ముఖానికి గాయాలుకావడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment