సాక్షి, బొమ్మనహళ్లి: అత్యంత ఖరీదైన సైకిల్‌ను చోరీ చేసేందుకు వచ్చిన దొంగను స్థానికులు సీసీ కెమెరా ద్వారా పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బెంగళూరులోని సుబ్రమణ్య నగర్‌లో ఈ నెల 3న చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఓ దొంగ సుబ్రమణ్య నగర్‌లో చోరీ కోసం రెక్కీ నిర్వహించాడు.
వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఖరీదైన సైకిల్‌పై అతని కన్ను పడింది. ఆ రోజు సాయంత్రం కట్టర్ సహాయంతో తాళం తొలగించి సైకిల్‌ను చోరీ చేస్తుండగా యజమాని సీసీ కెమెరా ద్వారా గుర్తించి కేకలు వేస్తూ బయటకు వచ్చారు. భయందోళనకు గురైన ఆ దుండగుడు అక్కడే ఉన్న కారు కింద దాక్కున్నాడు. అది గమనించిన స్థానికులు ఆ వ్యక్తి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందుతుడు తన పేరు కల్లెష్ అని ఒక్కసారి మల్లేష్‌అని మరోసారి చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment