బస్టాండ్‌లో పంది దాడి.. ముగ్గురికి గాయాలు | Pig Attacked On Passengers In Sanga Reddy Bus Station | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో పంది దాడి.. ముగ్గురికి గాయాలు

Apr 18 2019 7:22 PM | Updated on Apr 18 2019 7:48 PM

Pig Attacked On Passengers In Sanga Reddy Bus Station - Sakshi

సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ఓ అడవి పంది గురువారం హల్‌ చల్‌ చేసింది. బస్టాండ్‌లోకి వచ్చి ప్రయాణికుల్ని పరుగులు పెట్టించింది. అకస్మాత్తుగా ప్రయాణికులపై దాడి చేసి ముగ్గుర్ని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఓ మహిళ చేతికి తీవ్రగాయమైంది. ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి అడవి పందిని రాళ్లతో బయటకు తరిమికొట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

గాయపడిన మహిళను 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అడవి పంది విషయం అటవీ శాఖాధికారులకు తెలియజేయడంతో వారు వలతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పందిని పట్టుకోవడానికి అటవీశాఖ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆఖరికి జాలీ వేసి పట్టుకుని అడవికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement