
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని పేకట క్లబ్‌లపై పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడులు చేయడంతో పేకాటరాయుళ్లు ఉలిక్కిపడ్డారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరంలోని టౌన్ హాళ్లు, కాస్మోపాలిటీన్ క్లబ్, యూత్ క్లబ్‌లపై పోలీసు బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.
పెద్దఎత్తున పేకాట శిభిరాలు జరుగుతున్నాయనే సమాచారంతో దాడి చేసిన పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. వీకెండ్ కావడంతో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రాజమండ్రి, ఖమ్మం వంటి అనేక ప్రాంతాల్లో క్లబ్‌లు లేకపోవడంతో ఇక్కడికి వచ్చిన పేకాటరాయుళ్లకు పోలీసుల మెరుపు దాడులు ముచ్చెమటలు పట్టించాయి. పెద్ద ఎత్తున నగదు పట్టుబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment