
సాక్షి, పెదవాల్తేరు (విశాఖ తూర్పు) : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై విశాఖపట్నం ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును హైదరాబాద్‌కు బదిలీ చేయనున్నట్టు తెలిసింది. ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో రాంగోపాల్‌వర్మ తనతో అసభ్యంగా మాట్లాడారంటూ ఐద్వా ప్రతినిధి ఎం.మణి.. గత నెల 21వ తేదీన ఎంవీపీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రాంగోపాల్‌వర్మపై సీఐ ఎం.మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వర్మను వెంటనే అరెస్ట్ చేయాలని ఐద్వా ప్రతినిధులు నగరంలో ధర్నాలు చేశారు. వర్మ ఇప్పటికే ఓ కేసులో హైదరాబాద్‌లో విచారణ ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ కేసును కూడా పోలీసులు అక్కడికే బదిలీ చేయనున్నట్టు సమాచారం. దీనిపై ఎంవీపీ సీఐ ఎం.మహేశ్వరరావుని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ కేసుకు సంబంధించి ఐద్వా ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment