సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి కడ్తాల్ మండలం మైసిగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలోఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వస్తుండా ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment