
సాక్షి, అనంతపురం : జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. గురువారం రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 15 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ప్లాన్ ప్రకారం సిగ్నల్స్ వైర్లు కట్ చేసి రాయలచెరువు, జూటూరు రైల్వే స్టేషన్లలో కొందరు గుర్తుతెలియని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించక పోవటంపై బాధితులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment