express rails
-
ఆ రైళ్లలో ఏసీ కోచ్‌ల ధరలు తగ్గాయ్!
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్. సామాన్యులు కూడా ఏసీ బోగీల్లో ప్రయాణించేలా... ఈ బోగీల టిక్కెట్ ధరలను భారతీయ రైల్వే తగ్గించింది. సౌత్ వెస్ట్ జోన్‌లోని ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్‌ల్లోని ఏసీ బోగీలకు టికెట్ ధరను తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. కర్ణాటకలోని బెంగళూరు, గదగ్, మైసూర్ ప్రాంతాల నుంచి ఈ ఐదు రైళ్ల సర్వీసులను నిర్వహిస్తున్నారు. తగ్గిన ఏసీ బోగీల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూడండి... గదగ్- ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగి ప్రయాణ ఛార్జీ ప్రస్తుతం రూ.495గా ఉంది. దాన్ని రూ.435కి తగ్గించారు. ఈ తగ్గింపు ధర నవంబరు 11 నుంచి అమల్లోకి వస్తుంది. మైసూర్-షిరిడి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీ టికెట్ ధరను సౌత్ వెస్ట్రన్ రైల్వే 495 రూపాయల నుంచి 260 రూపాయలకి తగ్గించింది. ఈ తగ్గింపు ధర డిసెంబరు 3 నుంచి అమల్లోకి రానుంది. మైసూర్, బెంగళూరు మధ్యలో ఇది నడవనుంది. యశ్వంత్‌పూర్-బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మూడు ఏసీ బోగీలు ఉన్నాయి. వాటి టిక్కెట్ ధరను 735 రూపాయల నుంచి 590 రూపాయలకి తగ్గించారు. నవంబరు 30 నుంచి ఈ ధరలు వర్తించనున్నాయి. యశ్వంత్‌పూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ ధర రూ.345 ఉండగా.. దాన్ని రూ.305కి తగ్గించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే. నవంబరు 22 నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయి. యశ్వంత్‌పూర్-హుబ్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్ టికెట్ ధరను కూడా 735 రూపాయల నుంచి 590 రూపాయలకి తగ్గించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే. -
సిగ్నల్స్ వైర్లు కట్ చేసి రైళ్లలో చోరీ
-
ప్లాన్ ప్రకారం రైళ్లలో చోరీలు
సాక్షి, అనంతపురం : జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. గురువారం రాయలసీమ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి 15 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ప్లాన్ ప్రకారం సిగ్నల్స్ వైర్లు కట్ చేసి రాయలచెరువు, జూటూరు రైల్వే స్టేషన్లలో కొందరు గుర్తుతెలియని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించక పోవటంపై బాధితులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'దూరప్రాంత రైళ్లలో సీసీ కెమెరాలు'
తిరుపతి: సుదూర ప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో సీసీకెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే బోర్డు మెంబర్ (రైల్వే పోలీస్- హెల్త్ అండ్ శానిటేషన్ విభాగాలు) ప్రదీప్‌కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన తిరుపతి రైల్వేస్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. రైళ్లలో తరచూ జరుగుతున్న చోరీలు, ఇతర సంఘటనల నేపథ్యంలో ప్రయోగాత్మకంగా కొన్ని సుదూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేసి పరిశీలిస్తామన్నారు. తర్వాత ఎదురయ్యే సాంకేతిక సమస్యలను అధ్యయనం చేసి దేశ వ్యాప్తంగా ముఖ్యమైన రైళ్లలో ఈ నిఘా వ్యవస్థను పెంచుతామన్నారు. రైల్వేస్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైల్వే పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా ఆర్పీఎఫ్ పోలీసులతో నిఘా పెంచామని తెలిపారు. రైల్వే ఉద్యోగులు, ప్రయాణీకుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే ఆరోగ్య విభాగాన్ని మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. అందుకు 160 మంది స్పెషల్ డాక్టర్లను రైల్వే బోర్డు ద్వారా నియమించాల్సి ఉందన్నారు. తిరుపతిలో అవసరాన్ని బట్టి రైల్వే హాస్పిటల్ ఏర్పాటుకు అన్నిచర్యలు పరిశీలిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది రైల్వే భద్రతా దళాల ద్వారా దేశంలోని 8వేల రైల్వేస్టేషన్లలో 7,500 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చామని వివరించారు. ఇప్పటివరకు ఆర్పీఎఫ్ విభాగం ద్వారా చేపడుతున్న భద్రతా చర్యలు, పనితీరుకు గుర్తింపుగా కేంద్ర హోంశాఖామంత్రి నుంచి ఉత్తమ అవార్డులు వచ్చాయని చెప్పారు. సమావేశంలో చీఫ్ రైల్వే పర్సనల్ ఆఫీసర్ ఎన్వి.రమణారెడ్డి, సీనియర్ లైజన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ, గుంతకల్ సీనియర్ డీసీఎం రాఖేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.