తగ్గిన ఏసీ బోగీల ధరలు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్. సామాన్యులు కూడా ఏసీ బోగీల్లో ప్రయాణించేలా... ఈ బోగీల టిక్కెట్ ధరలను భారతీయ రైల్వే తగ్గించింది. సౌత్ వెస్ట్ జోన్‌లోని ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్‌ల్లోని ఏసీ బోగీలకు టికెట్ ధరను తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. కర్ణాటకలోని బెంగళూరు, గదగ్, మైసూర్ ప్రాంతాల నుంచి ఈ ఐదు రైళ్ల సర్వీసులను నిర్వహిస్తున్నారు.
తగ్గిన ఏసీ బోగీల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూడండి...
- గదగ్- ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగి ప్రయాణ ఛార్జీ ప్రస్తుతం రూ.495గా ఉంది. దాన్ని రూ.435కి తగ్గించారు. ఈ తగ్గింపు ధర నవంబరు 11 నుంచి అమల్లోకి వస్తుంది.
- మైసూర్-షిరిడి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీ టికెట్ ధరను సౌత్ వెస్ట్రన్ రైల్వే 495 రూపాయల నుంచి 260 రూపాయలకి తగ్గించింది. ఈ తగ్గింపు ధర డిసెంబరు 3 నుంచి అమల్లోకి రానుంది. మైసూర్, బెంగళూరు మధ్యలో ఇది నడవనుంది.
- యశ్వంత్‌పూర్-బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మూడు ఏసీ బోగీలు ఉన్నాయి. వాటి టిక్కెట్ ధరను 735 రూపాయల నుంచి 590 రూపాయలకి తగ్గించారు. నవంబరు 30 నుంచి ఈ ధరలు వర్తించనున్నాయి.
- యశ్వంత్‌పూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ ధర రూ.345 ఉండగా.. దాన్ని రూ.305కి తగ్గించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే. నవంబరు 22 నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయి.
- యశ్వంత్‌పూర్-హుబ్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్ టికెట్ ధరను కూడా 735 రూపాయల నుంచి 590 రూపాయలకి తగ్గించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే.
Comments
Please login to add a commentAdd a comment