రైల్వే ప్రయాణికులకు ‘చల్లని’ కబురు!
న్యూఢిల్లీ: ఏసీ ప్రయాణాన్ని అందరికీ చేరువ చేసేందుకు త్వరలో ఎకానమీ ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్లీపర్, టైర్–1, టైర్–2, టైర్–3 ఏసీ కోచ్‌లకు అదనంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కోచ్‌లో టికెట్ ధర టైర్–3 ఏసీ కంటే తక్కువ. రైల్వే సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఎకానమీ ఏసీ కోచ్‌లో ఉష్ణోగ్రత 24–25 మధ్య ఉంటుందని, కాబట్టి ప్రయాణికులకు దుప్పట్లు అవసరం ఉండదన్నారు.
ఇటీవల ప్రవేశపెట్టిన హమ్‌సఫర్ రైళ్లలోనూ టైర్–3 ఏసీ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఎకానమీ ఏసీ కోచ్‌లు ప్రవేశపెడితే ప్రయాణికులు పెరుగుతారని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.