South Western Railway Zone
-
సిగ్నల్ రాంగ్ రూట్
భువనేశ్వర్: ఒడిశాలోని మూడు రైళ్లు ఢీకొని 275 మంది ప్రాణాలు బలైపోయిన తర్వాత మన దేశంలో రైల్వే సిగ్నల్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. మూడు నెలల ముందే సిగ్నల్ వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయంటూ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రాసిన లేఖ ఒకటి మీడియాకి చిక్కింది. సిగ్నల్ వ్యవస్థలో లోపాలు వెంటనే సవరించకపోతే భారీ ప్రమాదాలు చోటు చేసుకోవడం ఖాయమంటూ ఆ చీఫ్ మేనేజర్ రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతూ ఫిబ్రవరి 9న లేఖ రాశారు. ఫిబ్రవరి 8వ తేదీన బెంగుళూరు నుంచి న్యూఢిల్లీకి వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారీ ప్రమాదానికి గురై ఉండాల్సిందని డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల ముప్పు తప్పిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో మెయిన్ లైన్ ద్వారా వెళ్లవచ్చునని డ్రైవర్‌కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలా సిగ్నల్ వచ్చినప్పుడు పట్టాల దగ్గర ఉండే పాయింట్ మారాలి. రైలుని ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్‌కి మళ్లించడాన్ని పాయింట్ అంటారు. అయితే సిగ్నల్, పాయింట్ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. దీనిని గమనించిన డ్రైవర్ సరైన సమయంలో రైలుని ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థని సరిగా వినియోగించుకోలేకపోవడం వల్ల ముంచుకొచ్చిన ప్రమాదం ఇదని ఆయన ఆ లేఖలో వివరించారు. సిగ్నలింగ్ సాంకేతిక వ్యవస్థపై సమగ్రమైన విచారణ జరపడమే కాకుండా, స్టేషన్ మాస్టర్లు, ట్రాఫిక్ ఆఫీసర్లు, ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్లపై దీనిపై అవగాహన పెంచే ప్రయత్నాలు చేయాలన్నారు. సిగ్నల్ వ్యవస్థని నిరంతరం పర్యవేక్షిస్తూ వెనువెంటనే లోపాలు సరిదిద్దుకోకపోతే ఘోరమైన ప్రమాదాలు చూస్తామని సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ మూడు నెలల కిందటే హెచ్చరికలు జారీ చేశారు. -
పట్టాలు తప్పిన మంగళూరు-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు
ముంబై: గోవాలోని ప్రఖ్యాత దూద్‌సాగర్ జలపాతం వద్ద మంగళూరు-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడంతో దుష్సాగర్-సోనౌలిమ్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్, ఒక జనరల్ బోగీ పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జజరగలేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలులో ఉన్న మెత్తం 345 మంది ప్రయాణికులను హజరత్ నిజాముద్దీన్-వాస్కో డి గామా స్పెషల్ ట్రైన్లో మడ్గావ్ కు తరలించారు. అదే సమయంలో దూద్‌సాగర్-కరన్ జోల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగళూరు-ముంబై రైలుని రూట్ మార్చి తిరిగి కులెమ్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు. హుబ్లి డివిజన్ రైల్వే మేనేజర్ అరవింద్ మల్ఖేడేతో పాటు సీనియర్ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు సాగుతున్న తీరును పరిశీలించారు. -
ఆ రైళ్లలో ఏసీ కోచ్‌ల ధరలు తగ్గాయ్!
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్. సామాన్యులు కూడా ఏసీ బోగీల్లో ప్రయాణించేలా... ఈ బోగీల టిక్కెట్ ధరలను భారతీయ రైల్వే తగ్గించింది. సౌత్ వెస్ట్ జోన్‌లోని ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్‌ల్లోని ఏసీ బోగీలకు టికెట్ ధరను తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. కర్ణాటకలోని బెంగళూరు, గదగ్, మైసూర్ ప్రాంతాల నుంచి ఈ ఐదు రైళ్ల సర్వీసులను నిర్వహిస్తున్నారు. తగ్గిన ఏసీ బోగీల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూడండి... గదగ్- ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగి ప్రయాణ ఛార్జీ ప్రస్తుతం రూ.495గా ఉంది. దాన్ని రూ.435కి తగ్గించారు. ఈ తగ్గింపు ధర నవంబరు 11 నుంచి అమల్లోకి వస్తుంది. మైసూర్-షిరిడి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీ టికెట్ ధరను సౌత్ వెస్ట్రన్ రైల్వే 495 రూపాయల నుంచి 260 రూపాయలకి తగ్గించింది. ఈ తగ్గింపు ధర డిసెంబరు 3 నుంచి అమల్లోకి రానుంది. మైసూర్, బెంగళూరు మధ్యలో ఇది నడవనుంది. యశ్వంత్‌పూర్-బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మూడు ఏసీ బోగీలు ఉన్నాయి. వాటి టిక్కెట్ ధరను 735 రూపాయల నుంచి 590 రూపాయలకి తగ్గించారు. నవంబరు 30 నుంచి ఈ ధరలు వర్తించనున్నాయి. యశ్వంత్‌పూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ ధర రూ.345 ఉండగా.. దాన్ని రూ.305కి తగ్గించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే. నవంబరు 22 నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయి. యశ్వంత్‌పూర్-హుబ్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్ టికెట్ ధరను కూడా 735 రూపాయల నుంచి 590 రూపాయలకి తగ్గించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే. -
కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి లైన్ ప్రారంభం
వీడియో లింక్ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సాక్షి, న్యూఢిల్లీ/కళ్యాణదుర్గం రూరల్: రాయదుర్గం–తుముకూరు రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ట్రాక్ నిర్మాణం పూర్తయిన కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి మార్గాన్ని కేంద్ర మంత్రులు సురేష్‌ప్రభు, అశోక్‌గజపతిరాజు బుధవారం ఢిల్లీ నుంచి వీడియోలింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్(జీఎం) ఏకే గుప్తా, హుబ్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఏకే జైన్, చీఫ్ ఆపరేషన్ మేనేజర్ జీజే ప్రసాద్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్‌గుప్తా, సీపీఆర్వో విజయ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి రైల్వేలైన్ (23 కి.మీ.) ప్రారంభమవ్వడంతో కళ్యాణదుర్గం, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం మీదుగా తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలు (57477/57478)ను కదిరి దేవరపల్లి వరకు పొడిగించారు. ఈ రైలును బుధవారం కళ్యాణదుర్గంలో రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు పచ్చ జెండా ఊపి నూతన మార్గంలోకి పంపించారు. ఈ రైలు ప్రతిరోజూ తిరుపతిలో రాత్రి 10.30కి బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కదిరి దేవరపల్లికి చేరుకుంటుంది. తిరిగి అదేరోజు కదిరి దేవరపల్లిలో మధ్యాహ్నం 1.20కి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.20కి తిరుపతి చేరుకుంటుంది. కాగా, ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ.. ఏపీలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.