
పట్టాలు తప్పిన మంగళూరు-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు
ముంబై: గోవాలోని ప్రఖ్యాత దూద్‌సాగర్ జలపాతం వద్ద మంగళూరు-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడంతో దుష్సాగర్-సోనౌలిమ్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్, ఒక జనరల్ బోగీ పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జజరగలేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలులో ఉన్న మెత్తం 345 మంది ప్రయాణికులను హజరత్ నిజాముద్దీన్-వాస్కో డి గామా స్పెషల్ ట్రైన్‌లో మడ్గావ్ కు తరలించారు.
అదే సమయంలో దూద్‌సాగర్-కరన్ జోల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగళూరు-ముంబై రైలుని రూట్ మార్చి తిరిగి కులెమ్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు. హుబ్లి డివిజన్ రైల్వే మేనేజర్ అరవింద్ మల్ఖేడేతో పాటు సీనియర్ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు సాగుతున్న తీరును పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment