train derails
-
పట్టాలు తప్పిన మంగళూరు-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు
ముంబై: గోవాలోని ప్రఖ్యాత దూద్‌సాగర్ జలపాతం వద్ద మంగళూరు-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడంతో దుష్సాగర్-సోనౌలిమ్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్, ఒక జనరల్ బోగీ పట్టాలు తప్పాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జజరగలేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలులో ఉన్న మెత్తం 345 మంది ప్రయాణికులను హజరత్ నిజాముద్దీన్-వాస్కో డి గామా స్పెషల్ ట్రైన్లో మడ్గావ్ కు తరలించారు. అదే సమయంలో దూద్‌సాగర్-కరన్ జోల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగళూరు-ముంబై రైలుని రూట్ మార్చి తిరిగి కులెమ్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు. హుబ్లి డివిజన్ రైల్వే మేనేజర్ అరవింద్ మల్ఖేడేతో పాటు సీనియర్ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు సాగుతున్న తీరును పరిశీలించారు. -
యూపీలో రైలు ప్రమాదం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్పూర్(మధ్యప్రదేశ్) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్పహాడ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాల నుంచి పక్కకు ఒరిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించిందా, లేదా అనేది తెలియాల్సిఉంది. కాగా, ఇటీవల పలు రైలు ప్రమాదాల్లో ఉగ్రవాదుల హస్తం ఉందని తేలిన నేపథ్యంలో మహాకోశల్ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రైలు ప్రమాదంపై రైల్వే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ఝాన్సీ: 05101-1072 గ్వాలియర్: 0751-1072 బండా: 05192-1072 -
యూపీలో రైలు ప్రమాదం
-
ట్రక్ పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన ట్రైన్
-
మధ్యప్రదేశ్‌లో నదిలో పడ్డ రెండు రైళ్లు
-
మధ్యప్రదేశ్‌లో నదిలో పడ్డ రెండు రైళ్లు
* బ్రిడ్జి దాటుతూ అర్ధరాత్రి మాచక్ నదిలో పడిపోయిన కామయాని, జనతా ఎక్స్‌ప్రెస్‌లు * రెండు ఇంజన్లతో పాటు దాదాపు 15 బోగీలు నదిలో పడ్డాయంటున్న రైల్వే అధికారులు * మృతులు భారీగా ఉండే అవకాశం.. * హుటాహుటిన ఘటనాస్థలికి సహాయ బృందాలు హర్దా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి 11.45 ప్రాంతంలో పట్టాలు తప్పాయి. రెండు రైళ్ల ఇంజన్లతో పాటు ఏకంగా పదికి పైగా బోగీలు నదిలోకి పడిపోయాయి. ప్రమాదాల తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 30మంది మృతి చెందారు. ‘‘ముందుగా ముంబై నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. వెనక భాగంలోని దాదాపు 10 బోగీలదాకా నదిలోకి పడిపోయాయి. అదే సమయంలో జబల్పూర్ నుంచి ముంబై వెళ్తున్న జనతా ఎక్స్‌ప్రెస్ కూడా సమాచార లోపంతో సరిగ్గా అదే ప్రదేశంలో పట్టాలు తప్పింది. ఆ రైలు ఇంజన్‌తో పాటు 5 బోగీలు కూడా నదిలోకి పడిపోయాయి’’ అని రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా తెలిపారు. అయితే, కామయానిలో ఎస్ 1 నుంచి ఎస్ 11 వరకు మొత్తం 11 బోగీలు, అలాగే జనతాలో ఎస్ 2 నుంచి ఎస్ 6 వరకు 5 బోగీలు కలిపి మొత్తం 16 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు నది పొంగిపొర్లుతుండటం, బ్రిడ్జి పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి ఉండటం ప్రమాదాలకు కారణం కావచ్చంటున్నారు. కడపటి సమాచారం అందేవరకూ కూడా రెండు రైళ్ల తాలూకు ఇంజన్లు, బోగీలు ఇంకా నదిలోనే ఉన్నాయని సక్సేనా తెలిపారు. సహాయక చర్యలను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 25 మంది డాక్టర్లతో కూడిన వైద్య బృందాన్ని హుటాహుటిన ఘటనా స్థలికి పంపినట్టు ఆయన ట్వీటర్లో వెల్లడించారు. ఘటనా స్థలి వద్ద భారీ వర్షం పడుతుండటం, చిమ్మచీకటిగా ఉండటంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. బోగీలను వీలైనంత త్వరగా నదిలోంచి బయటికి తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. హర్దా కలెక్టర్ రజనీశ్ శ్రీవాస్తవ, జిల్లా ఎస్పీ, పలువురు రైల్వే ఉన్నతాధికారులు సహాయక సిబ్బందితో కలిసి మూడు ప్రత్యేక రైల్లో ఘటనా స్థలికి వెళ్లారు. కాగా, నదిలో పడిపోయిన రెండు రైళ్లకు సంబంధించిన 15 బోగీలలో చిక్కుకున్న 300 మంది ప్రయాణికులను రక్షించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో మాచక్ నది ఉధృతంగా ప్రవహిస్తోందని, ఆ ప్రవాహంలో 50 నుంచి 60 మంది వరకు కొట్టుకపోయారంటూ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లో రైళ్ల ప్రమాదాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. ముంబై, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి బయలుదేరే పలు రైళ్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు రాజస్థాన్, కోట మీదుగా మళ్లించినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. -
పట్టాలు తప్పిన రైలు: 12 మంది మృతి
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రోహ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగో థానే, రోహ స్టేషన్ల మధ్య నిది అనే గ్రామం వద్ద ఈ రోజు ఉదయం 10 గంటలకు దివా సావంత్వాది ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజన్‌తోపాటు నాలుగు బోగిలు పట్టాలు తప్పాయి. ముంబైకు 120 కిలోమీటర్లు దూరంలోని కొంకణ్ రైల్వే మార్గంలో ఆ ప్రమాదం సంభవించిందని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బందిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు రూ. 50 వేలు, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.10 వేలు నష్టపరిహారాన్ని అందించనున్నట్లు రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖార్గే ప్రకటించారు. రైలు ప్రమాదం కారణంగా కొంకణ్ రైల్వే మార్గంలో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. -
ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్సురైలు
-
పట్టాలు తప్పిన ధనపూర్ -కామఖ్య రాజధాని ఎక్స్‌ప్రెస్
బీహార్‌లోని పాట్నా సాహిబ్ స్టేషన్ వద్ద గత అర్థరాత్రి దన్‌పూర్ కమాఖ్య రాజధాని ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని తూర్పు మధ్య రైల్వే అధికార ప్రతినిధి యూ.కే.ఘా బుధవారం వెల్లడించారు. పదకొండు బోగీలు పట్టాలు తప్పాయని తెలిపారు. అయితే ప్రయాణీకులంతా సురక్షింతంగా ఉన్నారని చెప్పారు. ఈ రోజు ఉదయం 5 బోగీలను పట్టాలపైకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. మరో ఆరు బోగీలను పట్టాలపైకి తీసుకురావలసి ఉందన్నారు. అయితే ప్రయాణీకులకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి అసోంలోని కామఖ్యకు పంపినట్లు చెప్పారు.