బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | RTC Bus Hit To Bike In Khammam | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Published Sat, Oct 26 2019 8:36 AM | Last Updated on Sat, Oct 26 2019 8:36 AM

RTC Bus Hit To Bike In Khammam - Sakshi

ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు 

సాక్షి, కొణిజర్ల(ఖమ్మం) : ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ సంఘటన తనికెళ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చిలువేరు యల్లయ్య తెలిపిన వివరాలు.. జూలూరుపాడు కాకర్ల గ్రామానికి చెందిన కూరాకుల వెంకటేశ్వర్లు తన చెల్లెలు వెంకటనర్సమ్మతో కలిసి ద్విచక్రవాహనంపై ఖమ్మం ఆస్పత్రికి వెళుతున్నారు. ఈ క్రమంలో మధిర వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు బండిపై నుంచి రోడ్డు మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మమత జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ యల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పరిశీలించిన అసిస్టెంట్‌ కలెక్టర్‌...
తనికెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ప్రమాద బాధితుడిని పరిశీలించి తనకు వివరాలు తెలియజేయాలని ఆదేశించిన మీదట కొణిజర్ల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ట్రైనీ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, నయాబ్‌ తహసీల్దార్‌ తాళ్లూరి దామోదర్‌ మమత వైద్యశాలకు వెళ్లి వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వారు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement