Bus accident case
-
బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
సాక్షి, కొణిజర్ల(ఖమ్మం) : ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ సంఘటన తనికెళ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ చిలువేరు యల్లయ్య తెలిపిన వివరాలు.. జూలూరుపాడు కాకర్ల గ్రామానికి చెందిన కూరాకుల వెంకటేశ్వర్లు తన చెల్లెలు వెంకటనర్సమ్మతో కలిసి ద్విచక్రవాహనంపై ఖమ్మం ఆస్పత్రికి వెళుతున్నారు. ఈ క్రమంలో మధిర వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు బండిపై నుంచి రోడ్డు మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మమత జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ యల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్... తనికెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రమాద బాధితుడిని పరిశీలించి తనకు వివరాలు తెలియజేయాలని ఆదేశించిన మీదట కొణిజర్ల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభి, నయాబ్ తహసీల్దార్ తాళ్లూరి దామోదర్ మమత వైద్యశాలకు వెళ్లి వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వారు తెలిపారు. -
ముగ్గురిని బలిగొన్న బస్సు వేగం
సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : సొంత ఊరిలోని భూములను చూసుకుని తిరిగి వస్తూ ఆ ముగ్గురూ మృత్యు ఒడికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ కుటుంబ సభ్యులే. వివరాలివి. లక్ష్మిదేవి(45) , ఆమె భర్త వెంకట సుబ్బయ్య, ఈశ్వరమ్మ(65), అంజనమ్మ(35)లు వై. కోడూరుకు చెందిన వారు. ఉపాధి నిమిత్తం కడప సమీపాన చలమారెడ్డి పల్లెకు వచ్చేశారు. స్వస్థలమైన వై.కోడూరులో బంధువు మృతి చెందడంతో వీరంతా శనివారం చూసేందుకు వెళ్లారు. ఎలాగూ వచ్చామని పనిలో పనిగా గ్రామంలో తమకున్న కొద్దిపాటి స్థలాన్ని చూసుకున్నారు. ఈ లోగా చీకటిపడుతుండటంతో స్వగ్రామానికి బయలుదేరారు. కోడూరు గ్రామంలో ఒక సప్లయర్ ఆటోలో ఎక్కారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఆరుగురు ఉన్నారు. ఎర్రగుంట్ల– వై కో డూరు గ్రామాల మధ్య వేంపల్లె మార్గంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు ఆటో చేరుకోగానే ఎర్రగుంట్ల నుంచి వేంపల్లెకు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అంజనమ్మ, లక్ష్మిదేవి, ఈశ్వరమ్మలు అక్కడికి అక్కడే మృతి చెందారు. వెంకటసుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో డ్రైవర్, మరో బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్షతగాత్రుడు వెంకటసుబ్బయ్యను వెంటనే 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తరలించారు. వెంకటసుబ్బయ్య దంపతులు, అంజనమ్మలు పొట్టకూటికి పదేళ్ల కిందటే కడప దగ్గర ఉండే చలామరెడ్డి పల్లెకు వచ్చేశారు. అక్కడే కూలి పనులు చేసుకుంటు బతుకుతున్నారు. లక్ష్మిదేవి మేనత్త ఈశ్వరమ్మ ఎర్రగుంట్ల పట్టణంలోనే నివాసం ఉంటోంది. ఈమె భర్త బాలసుబ్బయ్య గతంలోనే చనిపోయాడు. అనుకోని సంఘటన ముగ్గురి ప్రాణాలను బలిగొన్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రుష్యేంద్రబాబు పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడ్డంతో వెంట వెంటనే తొలగింపు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బస్సు వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్థన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. మృతుల వివరాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పేదల జాగాకు ‘పెద్దల’ ఎసరు
సాక్షి, సిరిసిల్లటౌన్ : అది 2007 అక్టోబర్ 10 పితృఅమావాస్య. అదే రోజు పితృదేవతలకు సంతర్పణలు సమర్పించుకునేందుకు ముగ్గురు రోడ్డు మీదకు వచ్చారు. ఆర్టీసీ బస్సురూపంలో మృత్యువు వచ్చి వారిని కబళించింది. ఈ సంఘటనలో సిరిసిల్లఅర్బన్ మండలం పెద్దూరుకు చెందిన గీతకార్మికుడు చనిపోగా.. వారి కుటుంబానికి ప్రభుత్వం రెండు గుంటలు పంపిణీ చేసింది. ఇప్పుడు అదే భూమిని ఓ పెద్దమనిషి కబ్జా చేసి మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరిస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. భూపంపిణీ చేసిన జీవన్‌రెడ్డి బాధితులు ఆదిపెల్లి భాగ్య, సాగర్ కథనం ప్రకారం. పెద్దూరుకు చెందిన ఆదిపెల్లి పర్శరాములు వార్డుసభ్యుడు. పెద్దలకు బియ్యం ఇచ్చేందుకు అయ్యగారి వద్దకు మరో ఇద్దరు బంధువులతో కలసి రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంఓనే ఆర్టీసీ బస్సు ఢీకొని పర్శరాములుతోపాటు మరో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో పర్శరాములు కుటుంబం పేదరికానికి చలించిన అప్పటి సర్కారు.. మంత్రి జీవన్‌రెడ్డి చేతుల మీదుగా గ్రామశివారులోని సర్వేనంబరు 405/1లో రెండుగుంటలు అందజేసింది. భర్త మ రణంతో కొద్దిరోజులు అందులో కాస్తు చేసుకున్న భార్య భాగ్య.. ఇంటిపనుల భారంతో చాలారోజులుగా ఖాళీగా వదిలేసింది. పిల్లల భవిష్యత్‌కు ఉపకరిస్తుందని స్థలాన్ని కాపాడుతూ వస్తోంది. ఆ స్థలం విలువ రూ.8 లక్షలు అప్పట్లో ఊరిచివరన ఉన్న ఆ స్థలానికి ఇప్పుడు డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ సుమారు రూ.8 లక్షలు పలుకుతుంది. దీంతో ఓ రియల్‌వ్యాపారి కన్ను పడింది. తనకు పరిచయమున్న ప్రజాప్రతినిధులు, అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కబ్జా చేశాడు. స్థల యజమాని భాగ్య, ఆమె కుమారుడు సాగర్ న్యాయం చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదు. కొద్దిరోజుల క్రితం సదరు రియల్‌వ్యాపారి ‘స్థలం వదిలించుకుంటే మీకు డబుల్బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని’ చెబుతున్నాడు. ‘మా తండ్రి చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమి అది.. దానిని మాకు కాకుండా చేయొద్దు’ అని బతిమిలాడినా వినలేదు. తనపై దాడికి పాల్పడ్డట్లు వారిపై రియల్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి గారూ ఆదుకోవాలి అటు పోలీసులు, ఇటు అధికారుల నుంచి తమకు న్యాయం జరగడం లేదని మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కుటుంబ పెద్దచనిపోతే స్పెషల్ కేసు కింద భూమిని సర్కారు తమకు ఇస్తే.. దానిని పెద్దలు కబ్జా చేశారని, తద్వారా తమ కుటుంబం భవిష్యత్ ఏమిటని రోదించారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. హద్దులు చూపించాలని ఆదేశాం: రియల్టర్ పెద్దూరు శివారులోని 405/1 సర్వేనంబర్‌లో నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. 2007లో గ్రామంలో నెలకొన్న పరిస్థితుల దృష్యా్ట ఆ సర్వే నంబరులో స్థలం లేకున్నా.. రాత్రికి రాత్రే పట్టా తయారు చేయించి పర్శరాములు కుటుంబానికి రెవెన్యూ అధికారులు అందించారు. రెవెన్యూ సర్వేయర్‌తో వారి స్థలానికి హద్దులు చూపించాలని నేను కోరుతున్నా. నేను ఏ స్థలాన్ని కబ్జా చేయలేదు. నాపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. -
బొత్స మావాడే: జేసీ దివాకర్‌రెడ్డి
సాక్షి, హైద రాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమవాడేనని, ఆయన అన్ని విధాలా సహకరిస్తారనే నమ్మకం ఉందని మాజీ మంత్రి జేసీ వ్యాఖ్యానించారు. కొత్తకోట బస్సు ప్రమాదం కేసులో ఎవరూ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, మీడియానే ఈ విషయంలో పొగబెడుతోందని అన్నారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బొత్స కక్ష సాధిస్తున్నాడని, సీఎంతో నేను లాలూచీ పడ్డానని చెప్పమంటారా? మా మధ్య పొగ మాత్రమే పెట్టడమెందుకు? ఏకంగా నిప్పే పెట్టండి’ అని మీడియాపై నవ్వుతూ తన ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దివాకర్ ట్రావెల్స్‌పై బొత్స కక్ష సాధిస్తున్నారా? సహకరిస్తున్నారా? అని విలేకరులు అడగగా.. ‘‘బొత్స మావాడే. ఎప్పుడూ మాకు సహకారం అందిస్తూనే ఉన్నారు’’ అని బదులిచ్చారు.