బొత్స మావాడే: జేసీ దివాకర్‌రెడ్డి | Botsa Satyanarayana our man, says JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

బొత్స మావాడే: జేసీ దివాకర్‌రెడ్డి

Published Sat, Nov 2 2013 2:09 AM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

బొత్స మావాడే: జేసీ దివాకర్‌రెడ్డి - Sakshi

బొత్స మావాడే: జేసీ దివాకర్‌రెడ్డి

సాక్షి, హైద రాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తమవాడేనని, ఆయన అన్ని విధాలా సహకరిస్తారనే నమ్మకం ఉందని మాజీ మంత్రి జేసీ వ్యాఖ్యానించారు. కొత్తకోట బస్సు ప్రమాదం కేసులో ఎవరూ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, మీడియానే ఈ విషయంలో పొగబెడుతోందని అన్నారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బొత్స కక్ష సాధిస్తున్నాడని, సీఎంతో నేను లాలూచీ పడ్డానని చెప్పమంటారా? మా మధ్య పొగ మాత్రమే పెట్టడమెందుకు? ఏకంగా నిప్పే పెట్టండి’ అని మీడియాపై నవ్వుతూ తన ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దివాకర్ ట్రావెల్స్‌పై బొత్స కక్ష సాధిస్తున్నారా? సహకరిస్తున్నారా? అని విలేకరులు అడగగా.. ‘‘బొత్స మావాడే. ఎప్పుడూ మాకు సహకారం అందిస్తూనే ఉన్నారు’’ అని బదులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement